కార్గిల్ పోరాట యోధురాలిగా శ్రీదేవి కుమార్తె!
1999లో జరిగిన కార్గిల్ వార్ లో పాక్ ని ఇండియా చిత్తు చేసింది. ఈ యుద్ధంలో ఎందరో భారత సైనికులు వీరోచితంగా పోరాడారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో వైమానిక దళానికి గుంజన్ సక్సేనా అనే మహిళా సైనికురాలు అధికారిగా పనిచేశారు. కార్గిల్ వార్ లో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యం. పాక్ ఆర్మీకి ధీటుగా ఎదుర్కొన గుంజన్ సక్సేనా ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు.
గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో గుంజన్ సక్సేనా పాత్ర జాన్వీ కపూర్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన పనులు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణం కావడంతో గ్లామర్ కు దూరంగా ఉండే వార్ చిత్రం అయినప్పటికీ జాన్వీ ఒకే చెప్పేసిందట.

ఈ చిత్ర దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. జాన్వీ కపూర్ ఈ ఏడాదే దఢక్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ థక్త్ అనే చిత్రంలో నటిస్తోంది. శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి చిత్రంతోనే నటిగా మంచిమార్కులు కొట్టేసింది.


Click it and Unblock the Notifications











