Janhvi Kapoor 300 కోట్లతో తెలుగులోకి... 500 కోట్లతో తమిళంలోకి.. శ్రీదేవి ముద్దుల కూతురు ఎంట్రీ

అలనాటి అందాలతార శ్రీదేవి తనయగా సిల్వర్​ స్క్రీన్​కు పరిచయమైంది జాన్వీ కపూర్‌. సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రస్తుతం గట్టి ప్రయత్నమే చేస్తోంది. తక్కువ సినిమాల్లో నటించిన ఇప్పటికైతే క్రేజీ హీరోయిన్‌గా అనిపించుకుంటోంది. ఇప్పటివరకు బాలీవుడ్​లో వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీవైపు అడుగులో వేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం 300 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ బ్యూటీకి కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా ఓ స్టార్​ హీరో సినిమాలో. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్​ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే సెలెక్ట్​ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. అలా ధడక్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ... ఆ చిత్రం విజయం సాధించడంతో వరుస ఆఫర్లను అందుకుంది. ఆ తర్వాత గుంజన్ సక్సేనా వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రూహీ, మిలి, బవాల్ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

Janhvi Kapoor Tamil Entry With 500Crores Suriya Movie and Telugu Entry with 300 Crores Devara jr.Ntr

అలా ఓ వైపు హిందీ చిత్రాల్లో నటిస్తూనే సౌత్ ఇండస్ట్రీ ఆఫర్స్​ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఆమెకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి మరో ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించబోయే నెక్ట్స్​ సినిమాలో జాన్వీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య 'కంగువ' అనే భారీ బడ్జెట్​ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం తర్వాత సూర్య బాలీవుడ్ డైరెక్టర్ రాకేశ్​ ఓం ప్రకాష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మహాభారత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య కర్ణుడి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసమే జాన్వీని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్​ వచ్చే అవకాశముంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే జాన్వీ ఈ చిత్రంతో కోలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చినట్టవుతుంది. ఎలాగో హిందీలో జాన్వీ ఎన్ని చిత్రాలు చేస్తున్న స్టార్ డమ్ ఆమెకు అందని ద్రాక్షగా మారింది. కాబట్టి సౌత్​లో జాన్వీ ఓ బ్లాక్ బస్టర్ అందుకుంటే కచ్చితంగా అవకాశాలు క్యూ కడతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Janhvi Kapoor Tamil Entry With 500Crores Suriya Movie and Telugu Entry with 300 Crores Devara jr.Ntr

ఇకపోతే సూర్య - ఓం ప్రకాశ్​ సినిమా బడ్జెట్​ రూ.500కోట్లు అని సమాచారం. రెండు భాగాలుగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మొదటి భాగం పనులు కొనసాగుతున్నాయి. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల టాక్​. సూర్య, జాన్వీతో పాటు ఇండియన్​ సినిమాలోని ఇతర స్టార్స్​ను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్రం తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో ప్రాజెక్ట్ కూడా చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X