ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన జాన్వీ: బట్టలున్నా లేనట్లే.. సెగలు రేపుతోన్న శ్రీదేవి కూతురు

సినీ ఇండస్ట్రీలోకి అమ్మాయిలను వారసులుగా పరిచయం చేయడం చాలా అరుదు. మిగిలిన అన్ని భాషలతో పోలిస్తే.. హిందీలో మాత్రం చాలా మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్లలో చాలా మంది విఫలమవగా.. కొందరు మాత్రమే అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఒకరు. ఆ మధ్య హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది. తద్వారా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో షాకిచ్చింది. వివరాల్లోకి వెళ్తే....

 సినిమాలకు ముందు.. ఆ తర్వాత జాన్వీ ఇలా

సినిమాలకు ముందు.. ఆ తర్వాత జాన్వీ ఇలా

సినిమాల్లోకి వచ్చే ముందే జాన్వీ కపూర్ తన వివాదాస్పద తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయింది. అదే సమయంలో గ్లామరస్ డ్రెస్‌లు వేస్తూ లోకం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'ధడక్' అనే లవ్ స్టోరీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇక, తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది.

 ఇద్దరితో డేటింగ్.. ఆ ఫొటోలు బయటకొచ్చాయి

ఇద్దరితో డేటింగ్.. ఆ ఫొటోలు బయటకొచ్చాయి

హీరోయిన్‌గా మారక ముందే జాన్వీ కపూర్ పలువురితో ప్రేమ వ్యవహారాలు నడిపి సంచలనం అయింది. మొదట్లో అక్షత్ రంజన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే కుర్రాడితో ప్రేమాయణం సాగించింది. అంతేకాదు, వాళ్లిద్దరితో ప్రేమలో ఉన్న సమయంలో విడివిడిగా లిప్‌లాక్, రొమాన్స్ చేస్తూ దిగిన ఫొటోలు కూడా అప్పట్లో సంచలనం అయ్యాయి.

మహిళా పైలెట్‌గా మారి.. మార్కులు కొట్టేసింది

మహిళా పైలెట్‌గా మారి.. మార్కులు కొట్టేసింది

కార్గిల్‌ వార్‌లో యుద్ధ విమానాలు నడిపిన మహిళా పైలట్‌ గుంజాన్‌ సక్సేనా జీవిత చరిత్రా ఆధారంగా రూపొందిన చిత్రం 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌'. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నెటిజన్ల నుంచి మంచి స్పందననే అందుకుని సత్తా చాటింది.

‘రూహీ' అంటూ వచ్చింది.. నిరాశనే ఎదుర్కొంది

‘రూహీ' అంటూ వచ్చింది.. నిరాశనే ఎదుర్కొంది

జాన్వీ కపూర్ 'రూహీ' అనే సినిమాలో నటించింది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మించారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ చిత్రం మార్చి 11న విడుదలైంది. ఈ సినిమాకు రివ్యూలు అంత అనుకూలంగా రాలేదు. దీంతో కలెక్షన్లపై ప్రభావం చూపింది.

 తిరుమలలో ప్రత్యక్షం.... పెళ్లి గురించి కామెంట్స్

తిరుమలలో ప్రత్యక్షం.... పెళ్లి గురించి కామెంట్స్

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శిస్తుంటుంది జాన్వీ కపూర్. ఈ క్రమంలోనే ఇటీవల అక్కడకు విచ్చేసిన ఈ బ్యూటీ.. తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. భవిష్యత్‌తో తన వివాహం తిరుపతిలోనే జరుగుతుందని, తనకు కాబోయే వాడు పంచెలో, తాను కంచీపురం చీరలో వస్తామని చెప్పుకొచ్చిందీ గ్లామర్ క్వీన్.

 ఎప్పుడూ అందులోనే.. హాట్ టాపిక్ అవుతోంది

ఎప్పుడూ అందులోనే.. హాట్ టాపిక్ అవుతోంది

వరుస సినిమాల కారణంగా తీరిక లేకుండా ఉంటోంది జాన్వీ కపూర్. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో సెగలు రేపుతోన్న జాన్వీ

ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో సెగలు రేపుతోన్న జాన్వీ

తాజాగా జాన్వీ కపూర్.. ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌‌తో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. ఇందులో ఆమె బట్టలు ఉన్నా లేనట్లే కనిపిస్తోంది. అదే సమయంలో కొంటె చూపులతో కవ్విస్తోంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇప్పటికే ఐదు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X