దాన్ని చేతిలో పట్టుకు రావడంతో ట్రోలర్స్ కు చిక్కిన జాన్వీ.. విమానంలో వెళుతున్నవా లేక ట్రైన్ లోనా?

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకోవాలి అని జాన్వీ కపూర్ చాలానే కష్టపడుతోంది. ఈ బ్యూటీ మొదట్లోనే మంచి సక్సెస్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అయితే రాలేదు.

అయినప్పటికీ ఆమె అదృష్టం కారణంగా మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఆమెకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలలోకి వెళితే..

Janhvi Kapoor trolled once again latest pillow photo viral

మొదట్లోనే అతిగా అంచనాలు: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా వెండి తెరకు పరిచయమైన జాన్వీకపూర్ తప్పకుండా స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అవుతుంది అని మొదట్లోనే అందరూ అంచనాలు పెంచేసుకున్నారు. అయితే నటించిన మొదటి సినిమా ధడక్ బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం నిరాశ చెందకుండా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది.

Janhvi Kapoor trolled once again latest pillow photo viral

అతని సహకారం: గత ఏడాది వరకు జాన్వి అయితే విభిన్నమైన సినిమాలు అలాగే కమర్షియల్ సినిమాలు కూడా చేసింది. అయితే మునుపటి కంటే కూడా ఆమె నటిగా మాత్రం తనను తాను మార్చుకుంటూ వచ్చింది. కేవలం ఒకే జానర్లో కాకుండా హారర్ థ్రిల్లర్ సినిమాలను కూడా ఆమె చేసుకుంటూ వెళ్ళింది. ముఖ్యంగా ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అయితే చాలా హెల్ప్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో చాలా రకాల కథనాలు వెలువడుతున్నాయి.

Janhvi Kapoor trolled once again latest pillow photo viral

ఎన్టీఆర్ 30వ సినిమాలో: అయితే జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ అవ్వాలని అనుకుంటుంది. అప్పట్లో ఆమెకి చాలా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ ఇండస్ట్రీని తక్కువ అంచనా వేసి పెద్దగా సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు అనే విధంగా కూడా ట్రోల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె జూనియర్ ఎన్టీఆర్ తో 30వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆ సినిమాలో జాన్వి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.

Janhvi Kapoor trolled once again latest pillow photo viral

చేతిలో దిండు.. సోషల్ మీడియాలో ట్రోల్స్: అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి గ్లామర్ పరంగా అయితే మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎక్కడ కనిపించినా కూడా బాలీవుడ్ మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో మరోసారి ట్రోలింగ్ బారిన పడింది.

చేతిలో దిండు పట్టుకుని ఆమె ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఆమెపై రకరకాల మీమ్స్ అయితే వైరల్ అవుతున్నాయి. నువ్వు పొరపాటున రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సింది పోయి విమానాశ్రయానికి వచ్చావు అని కామెంట్లు చేస్తున్నారు.

గతంలోనే కౌంటర్ ఇచ్చిన జాన్వీ: ప్రస్తుతం జాన్వికాపూర్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ తరహా ట్రోల్స్ కు మాత్రం జాన్వి ఏ మాత్రం రియాక్ట్ కూడా అవ్వలేదు. గతంలో ఆమె చాలా రకాల ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాను అని అయితే వాటి గురించి మాట్లాడుకుంటూ వెళితే మనకు సమయం సరిపోదు అని అలాగే మన సమయాన్ని కూడా అలాంటి వాటి కోసం వృధా చేయకూడదు అని ఆమె చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X