అతిలోక సుందరిని మించేలా.. పదహారణాల తెలుగమ్మాయిలా లంగావోణిలో మెరిసిన జాన్వీ

అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ కూతురు అంటే జాన్వీ కపూర్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేసింది ఒక్క సినిమానే అయినా కోట్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. జూనియర్ అతిలోక సుందరి అనే ట్యాగ్‌కు సరైన నిర్వచనం.. అందానికి లంగావోణి కడితే అదే జాన్వీ కపూర్ అనేంతగా ఉంది. తాజాగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో హల్‌చల్..

సోషల్ మీడియాలో హల్‌చల్..

వెండితెరపై ధడక్ అనే చిత్రంతో మాత్రమే ప్రేక్షకులకు కనిపించి జాన్వీ కపూర్. ఆ సినిమా వచ్చి చాలా రోజులే అవుతున్నా.. మరో ప్రాజెక్ట్‌ను మాత్రం ఆడియెన్స్‌కు అందించలేకపోయింది. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నా.. అవన్నీ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. అయితే ఈ గ్యాప్‌ను సోషల్ మీడియా ద్వారా నింపేస్తుంది. అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్, తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అవి కాదు నటనను చూడండి..

అవి కాదు నటనను చూడండి..

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట్లో తన వద్దకు వచ్చిన అభిమానులు ధడక్ సినిమాలో బాగా నటించానని తన నటన గురించి మాట్లాడేవారని చెప్పుకొచ్చింది. అయితే ఈ మధ్య మాత్రం వ్యాయామా తరగతులకు వెళ్లేప్పుడు వేసుకుని పొట్టి దుస్తుల గురించి మాట్లాడుతున్నారని వాపోయింది. అయినా అందులో వారి తప్పేమీ లేదంటూ తన ఫ్యాన్స్‌ను వెనకేసుకొచ్చింది. తనలోని నటనను చూడండని కోరింది.

తిరుమల శ్రీవారి సన్నిధిలో..

తిరుమల శ్రీవారి సన్నిధిలో..

జాన్వీ కపూర్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అది కూడా సామాన్య భక్తురాలిగా కాలినడకన వెళ్లి మరీ దర్శించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. మెట్ల మార్గంలో నడుస్తూ ఉండగా.. మధ్యలో సేద తీరుతూ ప్రకృతిని ఆస్వాధిస్తున్నట్లున్న ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

లంగావోణిలో జాన్వీ..

లంగావోణిలో జాన్వీ..

అయితే తిరుమలలో జాన్వీ కపూర్ అచ్చమైన తెలుగమ్మాయిలా లంగావోణి ధరించి.. దర్శనమిచ్చినట్టు తెలుస్తోంది. తిరుమల పరిసర ప్రాంతాల్లో కూర్చుని ప్రసాదం తింటున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూస్తే నిజంగానే జూనియర్ అతిలోక సుందరి దిగివచ్చిందేమోనన్న అనుమానం కలిగేలా ఉంది.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో..

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జాన్వీ వెంటనే ముంబైకి పయనమైంది. ఈ మేరకు ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద జాన్వీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వైట్ పంజాబీ డ్రెస్‌లో ఏంజెల్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రేమగా పలకరించిన అతిలోక సుందరి..

ప్రేమగా పలకరించిన అతిలోక సుందరి..

ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న అభిమానులను జాన్వీ.. ప్రేమగా పలకరించింది. తనను ఫోటో తీయబోతోండగా ఓ అభిమాని కిందపడిపోతూ ఉంటే జాగ్రత్త అని చెప్పడం.. కారులో కూర్చునేప్పుడు అక్కడి ఫ్యాన్స్‌కు బాయ్ చెప్పడం చూసి అందరూ ఫిదా అయ్యారు.

Recommended Video

Janhvi Kapoor Spotted In Mumbai's Madh Jetty & Funny Auto Ride With Media !
ప్రస్తుతం పలు సినిమాలో..

ప్రస్తుతం పలు సినిమాలో..

జాన్వీ కపూర్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఘోస్ట్ స్టోరీస్ అంటూ రాబోతోన్న ఈ సిరీస్‌లో జాన్వీ నర్స్ పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా.. కరణ్ జోహర్ నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తక్త్ చిత్రంలో, గుంజాన్ సక్సేనా, రూహీ అఫ్జానా, దోస్తానా 2 చిత్రాలతో జాన్వీ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X