ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండరీ నటి శ్రీదేవి కూతురిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ , తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తొలుత జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. గత కొద్ది రోజులుగా జాన్వీ పెళ్లిపై రూమర్స్ వస్తున్నాయి. వీటిపై జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ కపూర్ ఇటీవల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె తన సన్నిహితుడు శిఖర్ పహారియాను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఈ ఊహాగానాలకు తాజాగా ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ చెక్ పెట్టారు.

Janhvi Kapoor wedding rumors denied by Boney Kapoor actress focuses on career now

పుకార్లకు బోనీ కపూర్ ఫుల్ స్టాప్
గత కొద్ది రోజులుగా జాన్వీ-శిఖర్ పెళ్లి గురించి విభిన్న కథనాలు వినిపించాయి. ముఖ్యంగా తిరుపతి లేదా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో వివాహం జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన బోనీ కపూర్, "ఇవన్నీ పూర్తిగా పుకార్లు మాత్రమే. ప్రస్తుతం జాన్వీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడే పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు" అని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి వార్తలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది.

ప్రేమలో నిజం... పెళ్లిలో ఇంకా సమయం
జాన్వీ-శిఖర్ మధ్య ఉన్న బంధం కొత్తది కాదు. చాలా కాలంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్. కుటుంబ వేడుకలు, సినిమా ఈవెంట్‌లు, దేవాలయ దర్శనాలు ఎక్కడైనా వీరిద్దరూ కలిసి కనిపించడం వారి అనుబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఒక పాడ్‌కాస్ట్‌లో జాన్వీ మాట్లాడుతూ, "శిఖర్‌తో ఉంటే నాకు భద్రతగా అనిపిస్తుంది. నేను నిజంగా నా లాంటి వ్యక్తిగా ఉండగలిగేది అతని దగ్గరే" అని చెప్పడం వైరల్ అయ్యింది.

జాన్వీకి తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి. ఆమె తరచూ ఆలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండపైకి నడిచి వెళ్లి దర్శనం చేసుకుంటుంది. గతంలో ఒక షోలో మాట్లాడుతూ "పెళ్లి చేసుకుంటే తిరుపతిలోనే జరగాలి" అని ఆమె చెప్పింది, పెళ్లి తర్వాత అక్కడే స్థిరపడాలని కూడా తన కోరిక ఉందని చెప్పింది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పెళ్లి పుకార్లకు కారణమయ్యాయని చెప్పొచ్చు.

ప్రస్తుతం జాన్వీ కెరీర్ పరంగా పీక్ దశలో ఉంది. ఇప్పటికే దేవర ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌తో జాన్వీకి సౌత్‌లో భారీ బ్రేక్ రావొచ్చని సినీ విశ్లేషకులు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ, ఇప్పుడు తన సొంత గుర్తింపుతో ముందుకు సాగుతున్నారు.

సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉండటమే కాకుండా, గ్లామర్‌తో పాటు నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇలా మొత్తానికి జాన్వీ కపూర్ పెళ్లి వార్తలు ప్రస్తుతం రూమర్స్ మాత్రమేనని స్పష్టమైంది. ప్రేమలో ఉన్నా, పెళ్లి విషయంలో మాత్రం ఆమె తొందరపడటం లేదు. ప్రస్తుత కెరీర్‌ను మరింత స్ట్రాంగ్ గా చేసుకోవడమే ఆమె లక్ష్యంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X