Janhvi Kapoor దేవర మూవీలో జాన్వీ కపూర్ ఫోటో లీక్.. శ్రీదేవీని మించిన అందంతో!
భారతీయ సినీ పరిశ్రమ గర్వించ దగిన అందాల నటి శ్రీదేవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్న కూతురు జాన్వీ కపూర్ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందీలో ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్న ఈ అందాల భామ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ ఫోటో వివరాల్లోకి.. అలాగే ఆ సినిమా గురించి విశేషాల్లోకి వెళితే..
జాన్వీ కపూర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ధడక్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా విజయం కావడంతో భారీ ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం గుంజన్ సక్సేనా చిత్రంలో నటించింది. ఆ తర్వాత రూహీ, మిలి, బవాల్ లాంటి సినిమాల్లో నటించినా ఫలితం దక్కలేదు. దాంతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న దేవర చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ అడుగుపెట్టింది. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతున్నాయి.
గోవాలో జరుగుతున్న దేవర సినిమా షూటింగ్ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. దాదాపు 15 రోజులకుపైగా గోవాలో ఎన్టీఆర్‌తోపాటు జాన్వీ కపూర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించానున్నారు.అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కథకు బలంగా నిలిచే రోల్‌లో తన ప్రతిభను నిరూపించుకొంటారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

దేవర చిత్రంలోని జాన్వీ కపూర్ ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. గ్రామీణ యువతి పాత్రలో లంగా ఓణిలో చక్కగా కనిపించారు. మెడలో చిన్న తాయత్తు లాంటింది ధరించి ఆకట్టుకొంటున్నారు. సాదాసీదా గ్రామీణ అమ్మాయిగా చూడగానే ముచ్చటేసేలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతున్నది. శ్రీదేవీ చూసిన ఫీలింగ్ కలుగుతున్నదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











