అప్పుడే స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన జాతిరత్నాలు బ్యూటీ ఫారియా!
సినిమా కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు. టాలెంట్ ఎంత ఉన్నా కూడా కాస్త అదృష్టం కూడా ఉండాలని అంటారు. ఇక మొదటి సినిమా జాతిరత్నాలు బాక్సాఫీస్ హిట్ గా నిలవడంతో హీరోయిన్ ఫారియా అబ్దుల్లా హాట్ టాపిక్ గా మారింది. హీరో నవీన్ పొలిశెట్టితో పాటు ఈ బ్యూటీపై కూడా దర్శక నిర్మాతల ఫోకస్ పడింది.
జాతిరత్నాలు సినిమా మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడమే కాకుండా ప్రాఫిట్స్ లోకి కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా హీరోయిన్ కు మొదటి నుంచి కూడా జనాల్లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. చిట్టి సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో ఆఫర్స్ చాలానే వస్తున్నాయట.

ఇక మాస్ హీరో రవితేజ సినిమాలో ఒక మంచి ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. రవితేజ, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఫారియా మాత్రం పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. మరి ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్స్ కు ఏ రేంజ్ లో పోటీని ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











