For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఊహించని ఆఫర్ పట్టేసిన ‘జాతి రత్నాలు’ చిట్టి: భారీ చిత్రంలో ఛాన్స్.. నక్కతోక తొక్కినట్లుందిగా!

  |

  సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటారు. అలాంటి వారిలో లోకల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఒకరు. 'జాతి రత్నాలు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈ భామ.. ఒకే ఒక్క సినిమాతో ఊహించని రీతిలో పాపులర్ అయింది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లా తాజాగా అదిరిపోయే ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  శృంగారపు ఫోజులతో నైనా గంగూలీ అలజడి.. వైరల్‌గా ఫోటోలు

  టాలీవుడ్‌కు దొరికిన ‘జాతి రత్నం'

  టాలీవుడ్‌కు దొరికిన ‘జాతి రత్నం'

  నవీన్ పోలిశెట్టి హీరోగా.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఈ చిత్రం ద్వారానే ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి మూవీతోనే ఈ బ్యూటీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

  చీరకట్టులో అందంగా ముస్తాబైన అదితి ప్రభుదేవా...

  రెండింట్లోనూ రాణించిన హీరోయిన్

  రెండింట్లోనూ రాణించిన హీరోయిన్

  ఫరియా అబ్దుల్లా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ‘జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీలో అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో తన ఇనోసెంట్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఫలితంగా ఈ బ్యూటీ తెలుగు కుర్రాళ్ల క్రష్‌ లిస్టులో చేరిపోయింది కూడా.

  యువ హీరోయిన్ క్లీవేజ్ షో అదుర్స్.. పార్వతీ నాయర్ గ్లామర్ షో

   క్యూ కట్టారు.. వర్కౌట్ అవలేదంట

  క్యూ కట్టారు.. వర్కౌట్ అవలేదంట

  మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఫరియా అబ్దుల్లాకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ మూవీ తర్వాత ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఈ అమ్మాయి మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. అందుకోసమే ఇప్పటి వరకూ ఏ ప్రాజెక్టును ప్రకటించలేదు. కానీ, చాలా వరకు చర్చల దశలో ఉన్నాయట.

  ఎద అందాలతో ఆకట్టుకొంటున్న నిక్కి తంబోలి.. బీచ్‌లో ఖత్రోంకి ఖిలాడి

  అందులో మాత్రం రచ్చ చేస్తోందిగా

  అందులో మాత్రం రచ్చ చేస్తోందిగా

  సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ సంబంధిత విశేషాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా రోజురోజుకూ తన ఫాలోవర్ల జాబితాను భారీగా పెంచుకుంటోంది.

  బికినీలో అదరగొట్టిన మందనా కిరిమి.. సముద్ర తీరాన్ని హీటెక్కించిన యువ హీరోయిన్

  గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోన్న చిట్టి

  గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోన్న చిట్టి

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఫరియా అబ్దుల్లా.. తన అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఆమె గ్లామర్ ట్రీట్ ఎక్కువగా ఇస్తోంది. తద్వారా తన అందాలతో కవ్విస్తోంది. అదే సమయంలో హాట్ డ్యాన్స్ వీడియోలను సైతం సోషల్ మీడియాలో వదులుతోంది. వీటితో పాటు సరికొత్త స్టైల్స్‌తో చేసిన రీల్స్‌ను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది.

  ఫరియాకు ఊహించని అవకాశం

  ఫరియాకు ఊహించని అవకాశం

  రెండు మూడు రోజులుగా ఫిలిం నగర్ ఏరియాలో ఫరియా అబ్దుల్లా గురించి ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే.. ఈ బ్యూటీ తాజాగా ఓ భారీ ఆఫర్‌ను అందుకుందన్న వార్తే. అవును.. ‘జాతి రత్నాలు' చిట్టి భారీగా తెరకెక్కనున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా అవకాశాన్ని అందుకుందట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

  Jathi Ratnalu Movie Review || జాతి రత్నాలు రివ్యూ
  బడా స్టార్ సరసన ఛాన్స్ పట్టింది

  బడా స్టార్ సరసన ఛాన్స్ పట్టింది

  బడా హీరో నుంచి రాబోతున్న ఓ సీక్వెల్‌లోనే ఫరియా అబ్దుల్లా ఛాన్స్ పట్టేసినట్లు తెలుస్తోంది. అందులో స్టార్ హీరో సరసన ఈ బ్యూటీ ఆడిపాడనుందని అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన మరింత సమాచారం మాత్రం బయటకు రాలేదు. దీంతో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు, హీరోల పేర్లను ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్.

  English summary
  Jathi Ratnalu Heroine Faria Abdullah Got Big Offer. This Movie Offcial Announcement Very Soon. In This Film Star Hero will play Lead Role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X