For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘జాతి రత్నాలు’ హీరోయిన్ గ్లామర్ ట్రీట్: క్లీవేజ్‌ షోతో షాకిచ్చిన చిట్టి.. ఇలా రెచ్చిపోయిందేంటి!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వాళ్లంతా ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోవడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. అలాంటి వారిలో 'జాతి రత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒకరు. చేసింది ఒక్క సినిమానే అయినా.. ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఫరియా అబ్దాల్లా తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటోను వదిలింది. ఆ వివరాలు మీకోసం!

  ‘జాతి రత్నాలు'తో పరిచయం అయింది

  ‘జాతి రత్నాలు'తో పరిచయం అయింది

  నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ తెరకెక్కించిన చిత్రం ‘జాతి రత్నాలు'. ఇందులో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయింది ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే ఈ బ్యూటీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

  మొదటి మూవీతోనే కోట్లు రాబట్టిందిగా

  మొదటి మూవీతోనే కోట్లు రాబట్టిందిగా

  ‘జాతి రత్నాలు' మూవీ రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ముగింపు సమయానికి ఇది రూ. 38.52 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఈ సినిమా ఏకంగా రూ. 27.02 కోట్లు లాభాలను అందుకుంది. మొదటి సినిమాతోనే ఫరియా ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘనతను అందుకుంది.

  నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది

  నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ‘జాతి రత్నాలు' సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా పరిచయం అయింది. అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో తన ఇనోసెంట్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఆమెను తెలుగు కుర్రాళ్లంతా క్రష్‌ లిస్టులో చేర్చేసుకున్నారు.

   వరుసగా ఆఫర్లు.. ఒక్కటీ ప్రకటించలే

  వరుసగా ఆఫర్లు.. ఒక్కటీ ప్రకటించలే

  ‘జాతి రత్నాలు' వంటి భారీ హిట్ తర్వాత ఫరియా అబ్దుల్లాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాలో నటించాలని చర్చలు కూడా జరిపారు. అయితే, ఈ బ్యూటీ మాత్రం అన్ని సినిమాలనూ ఒప్పుకోవడం లేదు. అందుకే చాలా ప్రాజెక్టులను రిజెక్ట్ చేసేసింది. అందుకే ఇప్పటి వరకూ ఒక్క దానిని కూడా ప్రకటించలేదు.

  అందులో ఫుల్ బిజీగా ఫరియా అబ్దుల్లా

  అందులో ఫుల్ బిజీగా ఫరియా అబ్దుల్లా

  హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించడానికి ముందు నుంచే ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ సంబంధిత విశేషాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా క్రమంగా తన ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది.

   ‘జాతి రత్నాలు' హీరోయిన్ గ్లామర్ ట్రీట్

  ‘జాతి రత్నాలు' హీరోయిన్ గ్లామర్ ట్రీట్

  సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఫరియా అబ్దుల్లా.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల గుర్రం పక్కన నిలబడి కొంటె చూపుతో కవ్విస్తోన్న ఫొటోలను వదిలింది. వాటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ‘జాతి రత్నాలు' హీరోయిన్ మరో హాట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

  Jathi Ratnalu Movie Review || జాతి రత్నాలు రివ్యూ
  చిట్టి అందాలకు షాక్ అవుతోన్న ఫ్యాన్స్

  చిట్టి అందాలకు షాక్ అవుతోన్న ఫ్యాన్స్

  ‘జాతి రత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా షేర్ చేసిన ఫొటోలో బ్లాక్ డ్రెస్ ధరించింది. ఇక, ఇందులో ఆమె ఎద అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఆ సినిమాలో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా క్లీవేజ్ షో చేయడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Jathi Ratnalu Heroine Faria Abdullah Recently Shared a Hot Cleavage Show Photo in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X