జాతిరత్నాలు హీరోయిన్‌కు అతి పెద్ద సమస్య.. అనుష్క తరహాలోనే.. ప్రభాసే షాక్ అయ్యాడు!
ఈ ఏడాది ఫస్ట్ వేవ్ కరోనా అనంతరం జనాలను అమితంగా ఆకట్టుకున్న సినిమా జాతిరత్నాలు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్న ఆ సినిమా నటీనటులకు అలాగే టెక్నీషియన్లకు కూడా మంచి గుర్తింపు అందించింది. అయితే మిగతా వాళ్ళ పరిస్థితి బాగానే ఉన్నా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాత్రం ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటోందట. కెరీర్ మొదట్లో అనుష్క కూడా అదే తరహాలో ఇబ్బంది పడింది.

లాజిక్ లేకుండా..
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించాడు. సినిమాకు విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చిత్ర యూనిట్ సినిమాను జనాల్లోకి చాలా కామెడీతో తీసుకెళ్లింది. లాజిక్ లేకుండా సినిమాను చూడాలని ముందే ప్రిపేర్ చేయడంతో సినిమాకు అది బాగా హెల్ప్ అయ్యింది.

మొత్తానికి సెట్టయ్యాడు
మొత్తానికి సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలవడంతో హీరో నవీన్ పొలిశెట్టికి మంచి క్రేజ్ పెరిగింది. సోలోగా 10ఏళ్ళ పాటు బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అతను మొత్తానికి జాతిరత్నాలు సినిమాతో సెట్టయ్యాడు. ప్రస్తుతం అతనికి ఆఫర్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఇక డైరెక్టర్ అనుదీప్ కు కూడా ఇతర నిర్మాతల నుంచి ఆఫర్స్ చాలానే వచ్చినప్పటికీ నెక్స్ట్ మళ్ళీ అదే బ్యానర్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఫరియా కూడా అనుష్క తరహాలోనే..
అందరి పరిస్థితి ఒకలా ఉంటే హీరోయిన్ ఫారియా అబ్దుల్లా పరిస్థితి మరొకాలా ఉందట. ఆమె ఇంత వరకు సెకండ్ మూవీపై అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఫరియా కూడా అనుష్క తరహాలోనే అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. సాధారణంగా హీరోయిన్స్ మరీ ఎక్కువ హైట్ ఉంటే మీడియం హీరోలు వాళ్ళతో వర్క్ చేయడానికి ఇబ్బంది పడతారు. కెరీర్ మొదట్లో అనుష్క హైట్ వల్లే చాలా సినిమాలు కోల్పోవాల్సి వచ్చింది.

అలా సెట్ చేసుకున్న అనుష్క
అనుష్కతో సినిమా చేయడానికి నాగార్జున, గోపిచంద్, ప్రభాస్ వంటి మంచి హైట్ ఉన్న హీరోలు బాగా సెట్టయ్యే వారు. ఇక అనుష్క టాలెంట్ తో అరుంధతి వంటి అవకాశాలు అందుకొని స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ అందుకుంది. అయితే ఫారియకు ఇప్పుడు పెద్దగా ఛాన్సులు రావడం లేదని టాక్ వస్తోంది.
Recommended Video

షాక్ అయిన ప్రభాస్
హిట్ కొట్టినప్పటికి ఆమె 5అడుగుల 10అంగులాల హైట్ తో ఉండడంతో ఓ వర్గం హీరోలు అమెతో సినిమా అంటే ఆలోచిస్తున్నారట. ఇక జాతిరత్నాలు ప్రమోషన్ లో ప్రభాస్ కూడా ఈ బ్యూటీ హైట్ చూసి షాక్ అయ్యాడు. హైహీల్స్ తో మ్యానేజ్ చేశారా? అంటూ సరదాగా కామెంట్ కూడా చేశాడు. మొత్తానికి ఫరియా బాక్సాఫీస్ హిట్ కొట్టినప్పటికి ఇంకా సరైన ఛాన్సులు అందుకోవడం లేదు. మరి రానున్న రోజుల్లో ఆమె ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











