For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'చిట్టి'నా మజాకా.. నైట్ డ్రెస్‌లో ఇలాంటి డ్యాన్స్ మునుపెన్నడూ చూసి ఉండరేమో?

  |

  జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన జాతి ర‌త్నాలు సినిమాలో ఈ హైదరాబాదీ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. నిజానికి ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. కానీ ఈ భామ జాతిరత్నాలు సినిమాతో మరింత దగ్గరైంది. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన ఫరియా అబ్దుల్లా కుర్రాళ్ళ మనసు దోచేసింది. అందం పాటు తనదైన అభినయంతో యువకుల మనసు దోచేసింది ఈ బ్యూటీ. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే

  సినిమా కంటే ముందే నాటకాల్లో

  సినిమా కంటే ముందే నాటకాల్లో

  ఇప్పుడు అయితే ఆమె సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ నాటకాల్లో దాదాపు 5 ఏళ్ల నుంచి నటిస్తోంది. సమాహార అనే ఒక థియేటర్ గ్రూప్ ద్వారా ఆమె నటన నేర్చుకుంటోంది. నటనలో ఇంట్రెస్ట్ ఉన్నట్లే ఆమె దర్శకత్వంలో కూడా ఇంట్రెస్ట్ ఉందట. అందుకే దర్శకత్వంలో, ప్రొడక్షన్లో అలాగే కెమెరా లైటింగ్ లాంటి విషయాల్లో తాను మెళుకువలు నేర్చుకున్నానని ఆమె గతంలో చెప్పుకొచ్చింది. అంతేకాదు వీటికి సంబంధించి కొంతమంది నటులతో కలిసి వర్క్ షాప్స్ కూడా నిర్వహించానని ఆమె చెప్పుకొచ్చారు

  ఆమెతో ప్రేమలో పడిపోయా

  ఆమెతో ప్రేమలో పడిపోయా

  ఇక డాన్స్ అంటే కూడా ఈ భామకు చాలా ఆసక్తి ఉందట. తాను చిన్నతనం నుంచే డాన్స్ చేసే దానిని అని, తనలో ఉన్న ఆ ఆసక్తి గమనించి తన తల్లిదండ్రులు తనను డాన్స్ క్లాసుల్లో చేర్చారని పేర్కొంది. అలాగే వివిధ డ్యాన్స్ వర్క్ షాప్ కి తీసుకు వెళ్ళేవారు అని చెప్పుకొచ్చింది. తాను చేసిన అన్ని పనులకు తన తల్లిదండ్రులు అండగా నిలిచారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఫేమస్ బెల్లీ డాన్సర్ మెహర్ మాలిక్ తనకు ఇన్స్పిరేషన్ అని ఈ భామ చెబుతూ ఉంటుంది. హైదరాబాదులో జరిగిన ఆమె షోస్ కి తాను హాజరయ్యానని ఆ సమయంలో ఆమె డ్యాన్స్ తో ప్రేమలో పడిపోయాను అని చెబుతోంది.

  ఇదో రకం డ్యాన్స్

  ఇదో రకం డ్యాన్స్

  ఇక తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఒక నిమిషం 19 సెకన్లు ఉన్న ఒక డాన్స్ వీడియో పోస్ట్ చేసింది. దీనిని హౌస్ డాన్స్ అంటారట. నైట్ డ్రెస్ లో ఈ భామ అలా డాన్స్ చేస్తూ ఉంటే కుర్రకారు ఒక్కరోజులోనే 327,000 వేల తెప్పించారు. జనానికి పెద్దగా పరిచయం లేని ఈ డ్యాన్స్ స్టైల్ కొత్తగా ఉండడంతో పాటు ఆమె నైట్ డ్రెస్ లో ఈ డాన్స్ వేయడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  వరుస అవకాశాలు

  వరుస అవకాశాలు

  ఫరియా అబ్దుల్లాకి జాతి ర‌త్నాలు తొలి చిత్ర‌మే అయిన‌ప్ప‌టికీ అద్భుతంగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాకుండా మేక‌ర్స్ దృష్టిని ఆక‌ర్షించింది. అయితే ఫ‌రియా అబ్ధుల్లాకు ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. మాస్ మ‌హ‌రాజా ప్ర‌స్తుతం ఖిలాడి అనే సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఇందులో క‌థానాయికగా ఫరియా అబ్దుల్లాకి అవకాశం ఇచ్చారనే ప్రచారం జరిగింది. అయితే దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది.

  English summary
  Jathi Ratnalu fame Faria Abdullah was seen in a funny dance video. she recently posted this video in her instagram. small video of her dance is became viral in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X