అందరికీ షాకిచ్చిన చిట్టి.. నవ్వుతూనే బాంబు పేల్చింది.. పాపం వాళ్ళంతా!
జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. నిజానికి ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా యూత్ కి పరిచయమే. కానీ ఈ భామ జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులకు అందరికీ దగ్గరైంది. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన ఫరియా అబ్దుల్లా కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఈ పొడుగు కాళ్ళ సుందరి తనదైన అభినయంతో యువకుల మనసు దోచేసింది. అయితే ఈ రోజు ఆమె పుట్టిన రోజు అని గూగుల్ చెప్పడంతో ఆమెకు రాత్రి నుండి ఆమెకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఇక ఈ విషయంలో అసలు సంగతి చెప్పి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

హైదరాబాద్ బ్యూటీ
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన జాతి రత్నాలు సినిమాలో ఈ హైదరాబాదీ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకి నాటకాల్లో దాదాపు 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇక డాన్స్ అంటే ఈ భామకు చాలా ఆసక్తి. చిన్నతనం నుంచి ఆమె డాన్స్ చేసేది. ఆ ఆసక్తి గమనించి తల్లిదండ్రులు ఆమెను డాన్స్ క్లాస్ లో చేర్చారు. అక్కడి నుంచి యూట్యూబర్ గా మారిన ఆమె సినిమాల్లో అవకాశం కూడా దక్కించుకుంది.

విచిత్రమైన డ్యాన్స్
నిజానికి ఈ భామ పేరు ఫరియా అయినా ఆ పేరు కంటే చిట్టి అనే జనాలు ఎక్కువగా గుర్తు పడుతున్నారు. చిట్టి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకు మాత్రమే సాధ్యం అయిన విచిత్రమైన డ్యాన్స్ లు వేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఆమె వేస్తున్న డాన్స్ ఆమెకు మాత్రమే అర్ధం అవుతుందో, ఏమో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్ లు వేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది.

అందరికీ షాక్
ఇక ఫరియా అబ్దుల్లా బర్త్ డే అంటూ ఈరోజు గూగుల్ తల్లి చెప్పడంతో ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి. దీంతో ఈ విషయం గురించి ఫరియా మాట్లాడుతూ తనకు విషెస్ చెప్పిన అందరికీ షాకిచ్చారు. అందరి ప్రేమ బాగుంది, కానీ అసలు ఈ రోజు నా బర్త్ డే కాదు.. అందరూ విషెస్ చెబుతున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఆమె నవ్వుతూ షాకిచ్చింది. అయితేనేమి తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారికి థాంక్స్ అని ఆమె చెప్పుకొచ్చింది.
Recommended Video

వరుస అవకాశాలు
ఇక ఫరియా అబ్దుల్లాకి జాతి రత్నాలు తొలి సినిమానే అయినా సూపర్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఫరియా అబ్ధుల్లాకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మాస్ మహరాజా రవి తేజ, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ లో తెరకక్కనున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాకి అవకాశం ఇచ్చారనే ప్రచారం ఉంది.


Click it and Unblock the Notifications











