'చిట్టి' రచ్చ మామూలుగా లేదుగా..రాత్రుళ్ళు కూడా పడుకోనివ్వకుండా..స్పెషల్ ట్రీట్!
జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమయిన హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. నిజానికి ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా పరిచయమే. కానీ ఈ భామ జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన ఫరియా అబ్దుల్లా కుర్రాళ్ళ మనసు దోచేసింది. అందం పాటు తనదైన అభినయంతో యువకుల మనసు దోచేసింది ఈ భామ. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక మిడ్ నైట్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే

హైదరాబాదీ బ్యూటీ
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన జాతి రత్నాలు సినిమాలో ఈ హైదరాబాదీ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. నాటకాల్లో దాదాపు 5 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న ఈ భామ సమాహార అనే ఒక థియేటర్ గ్రూప్ ద్వారా ఆమె నటన నేర్చుకుంటోంది.

ఆమె ఇన్స్పిరేషన్
డాన్స్ అంటే ఈ భామకు చాలా ఆసక్తి ఉందట. చిన్నతనం నుంచి ఆమె డాన్స్ చేసేదట. ఆ ఆసక్తి గమనించి తల్లిదండ్రులు ఆమెను డాన్స్ క్లాస్ లో చేర్చారట. ఇక ఫేమస్ బెల్లీ డాన్సర్ మెహర్ మాలిక్ తనకు ఇన్స్పిరేషన్ అని ఈ భామ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది కూడా.

వర్షంతో అర్దరాత్రి ట్రీట్
ఇక తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అర్ధరాత్రి దాటాక మూడు వీడియోలు షేర్ చేసింది. తక్కువ నిడివే ఉన్నా ఆమె షేర్ చేసిన వీడియోలు మాత్రం ఇప్పుడు రచ్చ రేపుతున్నాయి. హైదరాబాద్ కి వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఈ భామ డాన్సర్ అవతారం ఎత్తింది. ఎద అందాలు కనిపించీ కనిపించకుండా ఆమె డ్యాన్స్ చేస్తూ షేర్ చేసిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Recommended Video
రవితేజతో
ఫరియా అబ్దుల్లాకి జాతి రత్నాలు తొలి సినిమానే అయినా సూపర్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఫరియా అబ్ధుల్లాకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మాస్ మహరాజా త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ లో తెరకక్కనున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాకి అవకాశం ఇచ్చారనే ప్రచారం ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











