ప్రభాస్‌తో నటించడం అదృష్టం.. ‘ఫౌజీ'పై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు

సీనియర్ నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో దశాబ్దాల పాటు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో కొద్దిగా సెలెక్టివ్‌గా కనిపిస్తున్నప్పటికీ, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల సినీ నటి మంచు లక్ష్మి నిర్వహించిన 'టీచ్ ఫర్ చేంజ్' కార్యక్రమంలో జయప్రద పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆమె, తన తదుపరి ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

జయప్రద మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. 'ప్రభాస్‌తో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు వచ్చిన మంచి అవకాశాల్లో ఒకటి. నిజంగా ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను,' అని ఆమె అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఫౌజీ' చాలా బ్యూటిఫుల్ మూవీ. ప్రేక్షకులు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది,' అంటూ మూవీపై భారీ అంచనాలు పెంచేశారు.

Jaya Prada Calls Acting With Prabhas a Blessing Shares Excitement on Fauji Movie

ప్రస్తుతం సినీ తరం గురించి మాట్లాడుతూ జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అప్పట్లో ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్‌కు చాలా ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కానీ, భావ వ్యక్తీకరణ మాత్రం ఎప్పటికీ ముఖ్యమే. నా కెరీర్ 'అంతులేని కథ'తో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగడం నా అదృష్టం," అని తెలిపారు. ఇప్పటికీ ప్రేక్షకులు తనను ఆదరిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని, ఇంకా భిన్నమైన పాత్రలు చేయాలని ఆశిస్తున్నానని చెప్పారు.

ఇండస్ట్రీ పరిచయాల గురించి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు ఎప్పటికీ మారవు. అప్పట్లో ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ పరిశ్రమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకులు నన్ను ఇంతకాలం ఆదరించడం నా అదృష్టం,' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఫ్యాషన్ గురించి ప్రశ్నించగా జయప్రద చెప్పిన మాటలు హైలైట్ అయ్యాయి. 'నాకు ఎక్కువగా ఇష్టమయ్యేది చీరలే. ట్రెడిషనల్ లుక్‌లో ఉండే అందం వేరే దాంట్లో ఉండదు. మాడ్రన్ డ్రెస్సులు కూడా ఇష్టం కానీ, ట్రెడిషనల్ స్టైల్‌కు ప్రత్యేక గౌరవం ఉంటుంది' అని చెప్పారు.

అలాగే.. 'నార్త్, సౌత్ ఎక్కడ సినిమా చేసినా అక్కడి సంప్రదాయాలకు తగ్గట్టు డ్రెస్సింగ్ మార్చుకుంటాను. అదే నాకు ఇంతకాలం ప్రేక్షకుల ప్రేమ దక్కడానికి కారణం' అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రభాస్‌తో కలిసి 'ఫౌజీ'లో నటించడం తనకు ప్రత్యేక అనుభవమని చెప్పిన జయప్రద, ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె మాటలతోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X