ఆయనతో అఫైర్ అంటగట్టారు.. యాసిడ్ దాడి.. సూసైడ్‌ చేసుకోవాలనుకొన్నా.. జయప్రద

అలనాటి అందాల తార జయప్రద సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా స్టార్‌గా మెప్పించింది. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌కు మకాం మార్చింది. సమాజ్ వాదీ పార్టీ తరఫున ఆమె ఎంపీగా సేవలందించారు. అయితే సమాజ్ వాదీ పార్టీ నేత ఒకరు చేసిన దుష్ఫ్రచారం వల్ల తాను ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నట్టు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపులు

యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపులు

నటి, రాజకీయ వేత్త జయప్రద ఇటీవల క్వీన్స్‌లైన్ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరైంది. ఆ సదస్సులో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఓ దశలో ఎస్పీ నేత అజంఖాన్ తనపై దాడికి పురిగొల్పారు. యాసిడ్ దాడికి ప్రయత్నించారు అనే ఆమె పేర్కొన్నారు.

ప్రాణహాని తలపెట్టారని

ప్రాణహాని తలపెట్టారని

ఎస్పీ నేత అజంఖాన్ వర్గం తనను తీవ్రంగా టార్గెట్ చేసింది. నా ప్రాణాలకు హాని తలపెట్టేందుకు ప్రయత్నించారు. ఓ దశలో నేను ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తిరిగి వస్తానో లేదో అనే విషయాన్ని నా తల్లికి చెప్పకుండా వెళ్లేదానిని. మహిళను కాబట్టే నన్ను అనేక రకాలుగా బయపెట్టారు అని జయప్రద చెప్పారు.

రూమర్లు ప్రచారం చేశారని

రూమర్లు ప్రచారం చేశారని

నాకు సమాజ్ వాదీ నేత అమర్ సింగ్ గాడ్ ఫాదర్, గురువు లాంటి వాడు. కానీ నాకు ఆయనకు వేరే సంబంధాన్ని అంటగట్టారు. ఆయనతో అఫైర్ ఉన్నట్టు రూమర్లు ప్రచారం చేశారు. ఆ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ అమర్ సింగ్ స్వయంగా వచ్చి నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు అని జయప్రద గుర్తు చేసుకొన్నారు.

 ఆత్మహత్య చేసుకొందామనుకొన్నా

ఆత్మహత్య చేసుకొందామనుకొన్నా

రాజకీయ కుట్రలో భాగంగా నా ఫొటోలను మార్ఫింగ్ చేసి మీడియాలో ప్రచారం చేశారు. నాకు అమర్ సింగ్‌కు లింక్ పెట్టి నా పరువును దిగజార్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నేను ఆత్మహత్య చేసుకొందామా అని ఆలోచించాను. అలాంటి మనోవేదనకు గురయ్యాను అని జయప్రద చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X