twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్త మరణం తర్వాత కొండంత విషాదం.. అందుకే వాటికి దూరం.. జయసుధ

    |

    సహజ నటి అంటే ఠక్కున గుర్తొచ్చేంది జయసుధ. తన కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ధీటుగా కొనసాగిస్తున్నారు. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో జీవితం గట్టి దెబ్బ తగిలింది. భర్త నితిన్ మరణం భారీ విషాదాన్ని మిగిల్చింది. ఆ తీరని విషాదం నుంచి తేరుకొని తెలుగు పరిశ్రమకు విశేష సేవలందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జయసుధ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

    అందుకే క్రిస్టియన్‌గా మారాను

    అందుకే క్రిస్టియన్‌గా మారాను

    నేను జన్మత హిందువుని. కొన్ని ఊహించని పరిస్థితులు నెలకొనడం వల్ల నా తల్లితో సహా క్రైస్తవ మతంలోకి మారాం. అప్పటి నుంచి క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటాం. అందరికీ జనవరి 1 తేదీతో కొత్త సంవత్సరం మొదలైతే.. మాకు డిసెంబర్ తొలివారం నుంచే న్యూ ఇయర్ మొదలవుతుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలతో ఇళ్లంతా సందడిగా మారుతుంది.

    భర్త మరణం తర్వాత పరిస్థితి

    భర్త మరణం తర్వాత పరిస్థితి

    అయితే నా భర్త నితిన్ కపూర్ మరణం తర్వాత పండుగలను పెద్దగా జరుపుకోవడం లేదు. నా కెరీర్‌కు, జీవితానికి నా భర్త సపోర్ట్ చాలా గొప్పది. నేను షూటింగ్‌లతో బిజీగా ఉంటే నా పిల్లలు, నాకు సంబంధించిన విషయాలను ఆయనే చూసేవారు. పిల్లల జీవితాన్ని ఓపిగ్గా తీర్చి దిద్దారు. అలాంటి ఆయన నా జీవితంలో లేరనే విషయాన్ని ఊహించుకోలేం. అందుకే క్రిస్మస్‌తోపాటు ఏ పండుగను జరుపుకోవడం లేదు.

    <strong>మరోసారి తెరమీదకి సహజనటి: ఆ విషాదం తర్వాత మళ్ళీ సినిమాలోకి జయసుధ </strong>మరోసారి తెరమీదకి సహజనటి: ఆ విషాదం తర్వాత మళ్ళీ సినిమాలోకి జయసుధ

    పూర్తిగా సంతృప్తి లేదు

    పూర్తిగా సంతృప్తి లేదు

    ఇక కెరీర్ పరంగా ఆలోచిస్తే నాకు ఇంకా పూర్తిగా సంతృప్తి కలుగులేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాల్లో నటించాలని ఉంది. హాలీవుడ్‌లో మాదిరిగా తెలుగు సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రలు రావాలి. అప్పుడే నటీనటులకు సంతృప్తి కలుగుతుంది. నా కెరీర్‌లో నేను ఎన్ని వెరైటీ క్యారెక్టర్లు చేశానో నాకే తెలీదు అని జయసుధ అన్నారు.

     ఆరోగ్యపరంగా ఎలాంటి..

    ఆరోగ్యపరంగా ఎలాంటి..

    ఆరోగ్యంపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొను. జిమ్, యోగా, వాకింగ్, స్విమ్మింగ్ లాంటి వాటికి దూరం. రాత్రి పదిగంటల దాటగానే నిద్రపోతాను. ఉదయమే నాలుగు గంటలకే నిద్ర లేస్తాను. ఎప్పుడూ చలాకీగా ఉంటాను. ఒక చోట కూర్చొను. లిఫ్టు ఉన్నప్పటికీ మెట్లు మీద నుంచి నడిచి వెళ్తాను అని జయసుధ పేర్కొన్నారు.

    English summary
    Jaya Sudha is senior artist in tollywood. She was in deep sadness after her Hubby Nitin Kapoor death. In this occassion, Jaya Sudha speaks to media about personal life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X