జయలలిత బయోపిక్‌లో కంగన.. దిమ్మతిరిగేలా రెమ్యునరేషన్.. ఎంత డిమాండ్ అంటే
మణికర్ణిక విజయం తర్వాత బాలీవుడ్ నటి కంగన రనౌత్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో కంగన నటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆమె అడిగిన రెమ్యునరేషన్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. జయలలిత బయోపిక్ కోసం కంగన రనౌత్ అడిగిన రెమ్యునరేషన్ ఎంత అంటే...

తెలుగు, హిందీ భాషలలో
తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న జయలలిత బయోపిక్ తలైవి అనే చిత్రం కోసం ఇటీవల కంగన రనౌత్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. అయితే ఆమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ విని నిర్మాతలు ఒకింత షాక్‌కు గురయ్యారట. ఈ విషయాన్ని ప్రముఖ దినపత్రికకు చెందిన వెబ్‌సైట్ వెల్లడించింది.

కంగన రెమ్యునరేషన్ ఎంతంటే
ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ వెల్లడించిన ప్రకారం.. తలైవి సినిమాలో కంగన రనౌత్ నటించడానికి ఒకే చెప్పింది. అయితే రెండు భాషల్లో రూపొందుతున్న చిత్రం కోసం ఆమె రూ.24 కోట్ల పారితోషికం అడిగింది. అందుకు నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి సిద్ధపడినట్టు వార్తా కథనంలో పేర్కొన్నారు.

జాతీయ ప్రాజెక్ట్‌గా జయలలిత బయోపిక్
జయలలిత బయోపిక్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా మలిచేందుకు నిర్మాత విష్ణు ఇందూరి ప్రయత్నిస్తున్నారు. మణికర్ణిక తర్వాత కంగన రనౌత్ లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఆమె నటన ప్రతిభ కారణంగానే మణికర్ణిక చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్లు కురిపించిందనే విషయం ఆధారంగా కంగనకు భారీగా పారితోషికాన్ని ముట్టజెప్పారని సమాచారం.

జయ కుటుంబం నుంచి నో అబ్జక్షన్
జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించేందుకు అన్ని రకాల అనుమతులు పూర్తయ్యాయి. జయలలిత మేనల్లుడు దీపక్ నుంచి నిరభ్యంతర పత్రాన్ని పొందినట్టు తెలిసింది. దాంతో అన్ని అడ్డంకులు తొలగడంతో త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

విజయేంద్ర ప్రసాద్ స్టోరీ
జయలలిత బయోపిక్ తలైవి సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నారు. బాహుబలి ఫేం విజయేంద్ర ప్రసాద్ కథా పర్యవేక్షణ చేస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. జీవి ప్రకాశ్ అందించే మ్యూజిక్‌కు మాధవన్ కర్కీ సాహిత్యం సమకూరుస్తున్నాడు.


Click it and Unblock the Notifications











