జయలలిత బయోపిక్.. హైదరాబాద్‌లోనే ఎక్కువగా!

ప్రస్తుతం ఇండియాలోని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లో బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ రోజే బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరిన్ని రాజకీయ, సినీ ప్రముఖుల జీవిత చరిత్రలు సిద్ధం అవుతున్నాయి. తమిళ నాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కోసం కోలీవుడ్ లో భారీ డిమాండ్ నెలకొని ఉంది.

ఈ రేసులో మహిళా దర్శకురాలు ప్రియదర్శిని ముందంజలో ఉన్నారు. నిత్యామీనన్ జయలలిత పాత్రలో బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ది ఐరన్ లేడీ అని టైటిల్ కూడా ఖరారు చేసి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ ఈ చిత్రాన్ని వేగంగా చిత్రీకరించాలని దర్శకురాలు భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ది ఐరన్ లేడి చిత్ర షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుందట.

 Jayalalitha Biopic The Iron Lady to shoot in Hyderabad RFC

ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోందట. 2016 డిసెంబర్ 5న జయలలిత చెన్నైలో అనారోగ్యం కారణంగా మృతి చెందారు. మరి కొందరు దర్శకులు కూడా జయలలిత బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X