వైరల్ వీడియో: అంబరీష్ అంత్యక్రియల్లో పోలీసులతో జయప్రద వాగ్వాదం!
ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ ఇటీవల గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్ చివరి చూపు కోసం సినీ ప్రముఖులందరూ బెంగుళూరు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద సౌత్ జోన్ డిసీపీ అన్నామలై కుప్పుస్వామితో వాగ్వాదానికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమ అభిమాన నటుడు అంబరీష్ మరణించిన విషయం తెలిసి కర్నాటక వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలకు మించిన భారం అయింది.

ఆదే సమయంలో కంఠీరవ స్టూడియోకు వచ్చిన జయప్రద... ''నేను మాజీ ఎంపీని, అంతకు మించి నేను ఒక లేడీని, నాకు ప్రొటెక్షన్ కావాలి, ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది అంటూ డీసీపీ అన్నామలై' మీద ఫైర్ అవుతున్నట్లు వీడియోలో ఉంది.
కంఠీరవ స్టూడియో వద్ద జయప్రద కారుదిగి నడుచుకుంటూ వెలుతుండగా పోలీసులు ఆమెను ఆపారని, క్రౌడ్ ఎక్కువగా ఉన్నందున కొంతసేపు కారులోనే కూర్చోవాలని కోరగా జయప్రద డీసీపీతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











