పెళ్లికి ముందు ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్లం.. నాతో రిలేషన్ లో ఉండగానే వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్..
Jeevitha Rajashekar: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కపుల్ లల్లో జీవిత రాజశేఖర్ జంట ఒకటి. వీరి అన్యోన్యత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా జంటగానే వెళ్తారు. ఏ ఈవెంట్ లోనైనా జంటగానే కనిపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే.. జీవిత అంటే రాజశేఖర్.. రాజశేఖర్ అంటే జీవిత అన్నటు ఉంటుంది మీరు బంధం. ఈ అన్యోన్య దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ని సీనియర్ నటి జీవిత బయటపెట్టింది. సినిమా స్టోరీ లాగా సాగిపోయే వీరి కథలో ఎన్నో ట్రిస్టులు మలుపులు ఉన్నాయి. పెళ్లి కాక ముందు వీరిద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండేవారంట.
జీవిత రాజశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రేమ, పెళ్లి గురించి కీలక విషయాలను వెల్లడించింది. నటి జీవిత మాట్లాడుతూ.. ' రాజశేఖర్ ఎంతోమంది హీరోయిన్లతో కలిసి పనిచేసినా.. తనకు ఆయన మీద ప్రేమ తగ్గదు. ఆయన ఇతర హీరోయిన్లతో అలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నేను కరెక్ట్ గానే ఉంటే.. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని నేను భావిస్తాను. నా భర్త, పిల్లలు ఫ్రెండ్స్ విషయంలో చాలా ఫ్రీగా ఉంటాను. నేను వారిని సరిగ్గా అర్థం చేసుకునే అంతవరకు.. వాళ్లకు వేరే అవకాశం ఇవ్వనంతవరకు.. వారు వెళ్లరు అనుకుంటాను. ఏదైనా రిలేషన్ షిప్ లోనైనా ప్రాబ్లం వచ్చేదంటే.. ఎదుటివారికి అవకాశం ఇవ్వకపోవడం వల్లనేనని అర్థం చేసుకోవాలి.కొన్ని విషయాలలో సర్దుకుపోవాలి' అని పేర్కొన్నారు జీవిత.

'సర్దుకపోయినప్పడే.. గొడవలకు ఆస్కారం ఉండదు. గొడవలను ఎప్పుడు ఎదుర్కొంటాము. అప్పుడు మనం వారికి దూరమైనట్లే.. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అదే విషయాన్ని నా పిల్లలకి చెప్పాను. రాజశేఖర్ విషయంలో నేను ఎప్పుడు ఇన్ సెక్యూర్ గా ఫీల్ కాలేదు. ఒకవేళ ఏ అమ్మాయి అయినా తనని రమ్మని ఫోన్ చేస్తే.. ఆ విషయం కూడా రాజశేఖర్ నాకు చెప్తాడు . ఆయన మీద అంత నమ్మకం నాకు. అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
జీవిత తమ లవ్ స్టోరీ గురించి చెబుతూ..'తాము ఎప్పుడు పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవాలని భావించాం. అయితే.. పెళ్ళికి ముందు మేమిద్దరం ఒకే గదిలో ఉండే వాళ్ళం . ఇండస్ట్రీలో ఇది పెద్ద టాక్ కూడా. పలుమార్లు మా విషయం చర్చ కూడా వచ్చింది. మేమిద్దరం రిలేషన్ లో ఉండగానే.. వేరే అమ్మాయితో రాజశేఖర్ పెళ్లి ఫిక్స్ అయింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ సంబంధానికి ఓకే చెప్పారు ' అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పింది.

'ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి నాకు సీనియర్ ఆ విషయం తెలుసుకుని.. నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందుగానే ఊహించాను అందుకు తగ్గట్టుగానే ప్రిపేర్ అయ్యాను కానీ నావల్ల కాలేదు వల్లకాలేదు. ఓ సారి రాజశేఖర్ ను పెళ్లి చేసుకుని అమ్మాయి గుడికి వెళ్దామంటూ పిలిచింది. ఆ విషయం నాకు చెప్పి నాకు నన్ను కూడా తోడుగా రమ్మన్నారు రాజశేఖర్. కారులో మొదటి ముందు సీట్లో రాజశేఖర్ పక్కన అమ్మాయి కూర్చుంది. నేను వెనక సీట్లో కూర్చున్న.. మొదటి సారి తన కారులో నేను బ్యాక్ సీటులో కూర్చోవడంతో ఎంతగానో బాధపడ్డాను' అంటూ ఎమోషనల్ అయ్యారు నటి జీవిత.
'ఆ తర్వాత మా విషయం వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. దీంతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రాజశేఖర్ మా రిలేషన్ గురించి ఓపెన్ గా చెప్పేశాడు. జీవితను దూరం పెట్టడం తన వల్ల కాదని దిగేసి చెప్పాడు. దీంతో ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ సినిమాలోని నటించాం. అయితే ఆ సినిమాలో దురదృష్టశాత్తు రాజశేఖర్ కు యాక్సిడెంట్ జరిగింది. దాదాపు నెల రోజుల పాటు రాజశేఖర్ బెడ్ కే పరిమితమయ్యారు. ఆ సమయంలో తాను దగ్గర ఉండి సేవలు చేశాను ఆ తర్వాత తనను హాస్పిటల్ నుండి నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు నన్ను కూడా వాళ్లతోనే తీసుకువెళ్లారు తాను కోల్పోవడానికి దాదాపు ఏడాది పట్టింది అప్పుడు పెద్దల అంగీకారంతో మా పెళ్లి జరిగింది' అంటూ తన లవ్ స్టోరీని వెల్లడించింది జీవిత రాజశేఖర్.


Click it and Unblock the Notifications











