Jeevitha Rajashekar: "రాజశేఖర్‌కు వేరే పెళ్లి ఫిక్సయ్యాక కూడా మేమిద్దరం లివింగ్ రిలేషన్‌లో ఉన్నాం"
జీవితా రాజశేఖర్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో హీరోయిన్ గా మెరిసింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్నప్పుడే హీరో రాజశేఖర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్న సమయంలోనే ఒకే గదిలో కలిసి ఉండే వాళ్లం అని కూడా తెలిపింది. అయితే అప్పటికే రాజశేఖర్ కు వేరే పెళ్లి ఫిక్స్ అయినా.. వీరు కలిసి ఉండడంతో అది హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొచ్చింది. అలాగే తమ పెళ్లి ఎలా జరిగిందో కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1986లో తలంబ్రాలు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది హీరోయిన్ జీవితా రాజశేఖర్. ఆ తర్వాత ఆహుతి, ఇదా ప్రపంచం, డామిట్ కథ అడ్డం తిరిగింది, రాక్షస సంహారం, అన్నా చెల్లలు, ఇంద్రధనస్సు, జానకిరాముడు, నవభారతం, బావా మరదళ్ల సవాల్, స్టేషన్ మాస్టర్, మంచివారు మావారు, అంకుశం వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇలా తన కెరియర్ గ్రాఫ్ పెరుగుతున్న సమయంలోనే ఈమె హీరో రాజశేఖర్ తో ప్రేమలో పడింది. ముఖ్యంగా అప్పటికే ఆయనకు పెళ్లి కూడా ఫిక్స్ అవ్వడం.. ముహూర్తాలు పెట్టుకోవడం కూడా జరిగిందని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

హీరో రాజశేఖర్ కు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందని.. అయితే ఆ విషయం తామిద్దరికీ తెలుసని చెప్పింది. కానీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, అభిమానం, ప్రేమ ఉండగా.. దూరం కాలేకపోయామని జీవితా రాజశేఖర్ వెల్లడించింది. అయితే తామిద్దరికీ పెళ్లి చేసుకోవాలని ఉన్నా.. కుటుంబ సభ్యులను ఒప్పించకుండా వద్దు అనుకున్నారట. అందుకే పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని రాజశేఖర్ డిసైడ్ అయ్యారట. అయితే తాను జీవితతో ప్రేమలో, లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు నేరుగా ఆ అమ్మాయికే చెప్పారట.
ఓరోజు వీరు ముగ్గురూ కలిసి ఓ గుడికి కూడా వెళ్లారట. సరదాగానే గడిపినా.. రాజశేఖర్ దూరం అవుతున్నాడనే బాధ, బెంగతో జీవితకు వారం రోజులు జ్వరం వచ్చిందట. అదే సమయంలో తామిద్దరూ కలిసి సినిమాలు చేయడం.. ఒకే గదిలో కలిసి ఉండడం కూడా చేసే వాళ్లని చెప్పుకొచ్చింది. అయితే ఓరోజు ఆ అమ్మాయి జీవితతో తన రిలేషన్ గురించి ఆమె పేరెంట్స్ కు చెప్పిందట. జీవితతో మాట్లడకూడదని కండీషన్లు పెట్టిందట కానీ దానికి ఒప్పుకోలేకపోయిన రాజశేఖర్.. నీ ఇష్టం ఉంటే చేసుకో లేదంటే లేదని తేల్చి చెప్పగా.. ఆ అమ్మాయి అమెరికా వెళ్లిపోయిందట. ఇక ఆ తర్వాత ఏడాదికే రాజశేఖర్ కు యాక్సిడెంట్ జరగడంతో తానే అన్ని చూసుకున్నానని.. అలా పెళ్లికి ముందే వారింటికి వెళ్లినట్లు వివరించింది.

ఇక అప్పుడే పెద్దలు తమకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయి.. వారిద్దరినీ ఒక్కటి చేశారట. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కున్న ఈ జంట చివరకు ఒక్కటి కావడం.. జీవిత సినిమాలకు దూరం కావడం చకచకా జరిగిపోయాయి. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వాళ్లే హీరోయిన్లుగా రాణిస్తున్న శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్.


Click it and Unblock the Notifications











