ఆ స్టార్ హీరోతో అఫైర్... జియా ఖాన్‌ది హత్యా? ఆత్మహత్యా?

సినీ రంగుల ప్రపంచంలో ధృవతారగా వెలుగొందాలని వచ్చే ఎంతోమంది వర్ధమాన తారలు మధ్యలోనే రాలిపోతున్నారు. ఇక్కడ ఉండే మోసాలు, ఆకర్షణలు, ఇతర తళుకుబెళుకుల చేతికి చిక్కి మధ్యలోనే తమ జర్నీని ముగించేస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు పలువురు సెలబ్రిటీల ఆకస్మిక మరణాలు ఇండస్ట్రీని, ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. చాలా చిన్న వయసులోనే పీక్స్ చూసినవారు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కొందరి మరణాలకు కారణం ఏంటన్నది కూడా తెలియక మిస్టరీగా మారుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఈ మిస్టరీలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగులుతున్నాయి.

ఈ కోవలోకే వస్తుంది నటి జియా ఖాన్ అనుమానాస్పద మృతి కేసు. చేసింది 3 సినిమాలే అయినా, 18 ఏళ్లకే తిరుగులేని స్టార్‌డమ్ అందుకున్నారు జియా ఖాన్. ఇంకా ఎంతో భవిష్యత్ ఉండగానే కేవలం 25 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు తరలిపోయారు జియా ఖాన్. ఆమె ఆత్యహత్య చేసుకుందని కొందరు అంటుంటే.. కాదు హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జియా ఖాన్ జీవితంలో ఏం జరిగింది? ఆమె మరణం చుట్టూ ఉన్న అంతు చిక్కని ప్రశ్నలు ఏంటీ? అనేది పరిశీలిస్తే..

Jiah Khan Death Mystery The Untold Story Behind Bollywood Actress Tragic End

జియా ఖాన్ అసలు పేరు.. నఫ్సియా రిజ్వీ ఖాన్. అమెరికాలో స్థిరపడిన భారత సంతతి కుటుంబంలో ఆమె జన్మించారు. అయితే జియాఖాన్ లండన్‌లో పెరిగారు. తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లితో కలిసి లండన్ వచ్చేశారు జియా. సినిమాలపై ఆసక్తితో చిన్నప్పటి నుంచే కథక్, సల్సా, బ్యాలే వంటి డ్యాన్స్ నేర్చుకుంది. అనంతరం న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటనలో ఓనమాలు దిద్దింది.

చదువు మధ్యలోనే ఆపేసిన జియా ఖాన్ ఆ వెంటనే సినిమాలపై ఆసక్తితో ముంబైకి మకాం మార్చింది. 2007లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన నిశ్శబ్ధ్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ సరసన నటించి షాకిచ్చింది జియా. తన అందం, అద్భుత నటనతో తొలి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డ్‌కు నామినేట్ అయ్యారు జియా ఖాన్. ఆ తర్వాత గజినీ హిందీ రీమేక్‌లో నటించి సత్తాచాటారు ఈ ముద్దుగుమ్మ. అనంతరం మరో హిట్ మూవీ హౌస్‌ఫుల్‌లోనూ నటించి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. వరుస హిట్స్‌తో జియా ఖాన్‌కు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.

కెరీర్ విజయవంతంగా దూసుకెళ్తున్న దశలో 2013 జూన్ 3న జియా ఖాన్ ముంబై జుహులోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఇంట్లో తన తల్లి, సోదరి లేని సమయంలో జియా ఖాన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెను హుటాహుటిన జేజే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే జియా ఖాన్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం ముంబైలోనే ముస్లిం సాంప్రదాయాలను అనుసరించి జియా ఖాన్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆమీర్‌ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ్ మాల్యా, ప్రేమ్ చోప్రా సహా పలువురు ప్రముఖులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.

అయితే జియాఖాన్ మరణించిన 4 రోజుల తర్వాత తన ఫ్లాట్‌లో 6 పేజీల సూసైడ్ నోట్‌ను ఆమె సోదరి కనుగొన్నారు. అందులో తన ప్రియుడు సూరజ్ పంచోలీపై జియాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూరజ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. శారీరకంగా, మానసికంగా తనను వేధించేవాడని లేఖలో రాసుకొచ్చింది. జియా ఖాన్ సూసైడ్ నోట్ ఆధారంగా ముంబై పోలీసులు.. జూన్ 10, 2013న సూరజ్ పంచోలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే జూలై 2, 2013న సూరజ్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని.. సూరజ్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని జియా ఖాన్ తల్లి న్యాయ పోరాటం చేయడంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2016 ఆగస్ట్ 1న ఈ కేసులో హత్య జరిగిందన్న కోణాన్ని సీబీఐ తోసిపుచ్చింది. తమ దర్యాప్తు ప్రకారం ఉరి వేసుకోవడం వల్లే జియా ఖాన్ మరణించిందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే జియా తల్లి రబియా స్వతంత్రంగా బ్రిటీష్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ జాసన్ పేన్ జేమ్స్‌ను ఆశ్రయించారు. 2016 సెప్టెంబర్ 20న జాసన్ వెలువరించిన నివేదికలో.. జియా ఖాన్ ఉరివేసుకోవడం అనేది కట్టుకథగా అనిపిస్తోంది. ఆమె ముఖం, మెడపై ఉన్న గాయాలు ఇది ఆత్మహత్య కాదని చెబుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

దాంతో సూరజ్‌పై లైంగిక దాడి, హత్య అభియోగాలు మోపాలని ప్రాసిక్యూషన్ .. న్యాయస్థానాన్ని కోరింది. ఈ పరిణామాలతో సీబీఐ అధికారులు మరింత లోతుగా విచారణ జరిపి ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. దీనిని పరిశీలించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2023 ఏప్రిల్ 28న సూరజ్ పంచోలీని నిర్దోషిగా విడుదల చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సూరజ్ దోషి అనడానికి సరైన సాక్ష్యాధారాలు చూపించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ తీర్పుతో జియా ఖాన్ తల్లి రబియా కన్నీటి పర్యంతమయ్యారు. అయితే తన కుమారుడు సూరజ్ పంచోలీతో పరిచయానికి ముందే జియా ఖాన్ 4 సార్లు ఆత్మహత్యకు పాల్పడింది. హీరో తల్లి, ప్రముఖ నటి జరీనా వహబ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయినప్పటికీ జియా తల్లి రబియా మాత్రం ఇప్పటికీ తన బిడ్డకు న్యాయం చేయాలంటూ పోరాడుతూనే ఉన్నారు. అలా ఎంతో భవిష్యత్తు ఉన్న జియా ఖాన్.. అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడి కోట్లాది మంది అభిమానులను తీరని విషాదంలో ముంచారు. ఇప్పటికీ ఆమె మరణానికి కారణం ఏంటన్నది మిస్టరీగానే ఉంది.

Read more about: jiah khan sooraj pancholi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X