For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చీర లేపి మరి చూపిస్తున్న తెలుగు నటి.. ఉప్పొంగుతున్న ఎద అందాలతో పోజులు!

  |

  హిందీలో సూపర్​ హిట్​ వెబ్​ సిరీస్​ గా నిలిచింది ఫ్యామిలీ మ్యాన్. ఈ వెబ్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విలక్షణ నటుడు మనోజ్​ భాజ్​పాయ్​ ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్​ సిరీస్​లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రేయ ధన్వంతరి. ఈ ఒక్క సిరీస్​ మాత్రమే కాకుండా హర్షద్ మెహతా బయోపిక్ గా వచ్చిన స్కామ్​ 1992లో కూడా మెయిన్​ కీ రోల్​ ప్లే చేసింది. అక్కినేని నాగ చైతన్య తెరగేంట్రం చేసిన జోష్​ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ హాట్ బ్యూటి సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలతో పిచ్చెక్కిస్తూ ఉంటోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేద్దామా!

  నాగ చైతన్యకు ఫ్రెండ్ గా..

  నాగ చైతన్యకు ఫ్రెండ్ గా..

  అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ జోష్​. ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోనప్పటికీ, మంచి కథగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో కాలేజ్​లో నాగ చైతన్యకు భావన అనే ఫ్రెండ్ క్యారెక్టర్​లో కనిపించిన ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి. ఒంటరిగా ఏ గ్యాంగ్​లో చేరని నాగ చైతన్యతో ఆ కాలేజ్​లో తమదే మంచి గ్యాంగ్ అని చెబుతూ ఇంట్రడ్యూస్ చేసుకునే సీన్​ గుర్తుండే ఉంటుంది.

  అవకాశాలు రాకపోవడంతో..

  అవకాశాలు రాకపోవడంతో..

  జోష్ సినిమాతోపాటు సందీప్ కిషన్​ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. సినిమాలే కాకుండా పలు టీవీ అడ్వర్టైజ్​మెంట్స్​లలో కూడా మెరిసింది ఈ భామ. అయితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్​లో అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్​లో కొద్దిపాటి అవకాశాలు రావడం ప్రారంభమైంది. దీంతో బాలీవుడ్​కు చెక్కేసింది శ్రేయ.

  తాప్సీతో కలిసి..

  తాప్సీతో కలిసి..

  బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి వెళ్లిన శ్రేయ ధన్వంతరి.. టీవీ షోలు, వెబ్​ సిరీస్​లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్, స్కామ్​ 92 సిరీస్​లలో అవకాశాలు కొట్టేసింది. వాటితో తెగ పాపులర్​ అయింది ఈ అమ్మడు. ఈ సిరీస్​లతో వచ్చిన క్రేజ్​తో పలు సినిమా అవకాశాలు కూడా ఆమె వద్దకు చేరాయి. తమిళ్, హిందీ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే తాప్సీ మెయిన్ లీడ్​లో యాక్ట్​ చేసిన లూప్​ లపేటా చిత్రంలో నటించింది.

  మొదటి అడుగులు..

  మొదటి అడుగులు..

  లూప్ లపేటా చిత్రం అనుకున్నంత హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఇందులో తాప్సీతోపాటు తాహీర్​ రాజ్​ భాసిన్​ కూడా నటించాడు. ఈ మూవీ గురించి శ్రేయ ధన్వంతరి మాట్లాడుతూ ''నేను సినిమాలు చేయడానికి చాలా కారణాలున్నాయి. నాకు నటనపై ఆసక్తి ఎక్కువ. ఎలిప్పిన్​, తనూజ, అతుల్​ వంటి ప్రముఖులతో కలిసి నేను యాక్టింగ్​లో మొదటి అడుగులు వేశాను. ఈ చిత్రం టైటిల్​ చాలా లూపిగా ఉంది. కొత్త ప్రయోగాలు చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి సమయంలో లూప్​ లపేటాలో నటించడం చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపింది.

  రుబాబ్ వీడియో సాంగ్ లో..

  లూప్ లపేటా చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్​ ఇండియా, ఎలిప్సిస్ ఎంటర్​టైన్​మెంట్స్, ఆయుష్ మహేశ్వరి సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉంటే ఇటీవల చుప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రేయా ధన్వంతరి. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల రుబాబ్ అనే వీడియో సాంగ్ లో నర్తించిన ఈ బ్యూటి అద్భుత్​ సినిమాలో నటిస్తోంది.

  హోమ్లీగా కనిపించి..

  శ్రేయా ధన్వంతరిలో మంచి నటి మాత్రమే కాకుండా ఒక దర్శకురాలు కూడా ఉంది. ఏ వైరల్ వెడ్డింగ్ అనే మినీ సిరీస్ కు దర్శకత్వం వహించింది ఈ అమ్మడు. మోడల్ గా, నటిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటి. ఇక సినిమాలు, సిరీస్​ల విషయం పక్కన పెడితే అప్పట్లో హోమ్లీగా కనిపించే శ్రేయ ధన్వంతరి.. ఇప్పుడు హాట్​గా అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది.

  స్లీవ్ లెస్ బ్లౌజ్ లో..

  శ్రేయా ధన్వంతరి చేసే ప్రతీ ఫొటోషూట్​ అందాల ప్రదర్శనకే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక తాజాగా గ్రీన్ కలర్ సారీ, గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో బీచ్ లో అందాలను ఆరబోసింది. చీరను లేపి మరి తన నడుము అందాలను వయ్యారంగా ప్రదర్శించింది. అలాగే బ్లాక్ డ్రెస్ లో తన ఉప్పొంగుతున్న ఎద అందాలతో ఘాటుగా పోజులిచ్చింది గ్లామర్ బ్యూటి శ్రేయ ధన్వంతరి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో గింగిరాలు తిరుగుతున్నాయి.

  English summary
  Naga Chaitanya Josh Movie Actress Shreya Dhanwanthary Latest Photoshoot In Green Colour Saree And Black Dress Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X