హీట్ పుట్టించేలా హైదరాబాద్ బ్యూటీ హాట్ షో.. అవే ఫోకస్ అయ్యేలా సెల్ఫీలు!
ఈ మధ్య కాలంలో సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు కూడా మంచి హిట్ అవుతున్నాయి. అలా ఓటీటీ ప్రేక్షకుల మనసులు దోచుకున్న వెబ్ సిరీసుల్లో ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 కూడా ఉన్నాయి. వీటిలో కీలక పాత్రల్లో నటించి ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసిన బ్యూటి శ్రేయ ధన్వంతరి. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో తెలుగు సినిమాల్లో నటించింది.
ఆ తర్వాత హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు చేసింది. నటిగానే కాకుండా రచయితగా, మోడల్ గా, డైరెక్టర్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా హాట్ సెల్ఫీ పిక్స్ షేర్ చేసి నెట్టింట్లో హీట్ పుట్టిస్తోంది.

ఒకట్రెండు సీన్స్..
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా జోష్. ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోనప్పటికీ, మంచి కథగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో కాలేజ్‌లో నాగ చైతన్యకు భావన అనే ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించిన ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి. ఈ సినిమాలో కేవలం ఒకటి రెండు సన్నివేశాల్లో మాత్రమే తళుక్కుమంటుంది.

శైలు పాత్రలో..
జోష్ సినిమాతోపాటు సందీప్ కిషన్ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. ఇందులో శైలు అనే పాత్రతో అలరించింది ఈ హైదరాబాదీ బ్యూటి. సినిమాలే కాకుండా పలు టీవీ అడ్వర్టైజ్మెంట్స్లలో కూడా మెరిసింది ఈ భామ.
అయితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో కొద్దిపాటి అవకాశాలు రావడం ప్రారంభమైంది. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది శ్రేయ.

వరుస ఆఫర్లు..
బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి వెళ్లిన శ్రేయ ధన్వంతరి.. టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 92 సిరీస్‌లలో అవకాశాలు కొట్టేసింది. వాటితో తెగ పాపులర్ అయింది ఈ అమ్మడు. ఈ సిరీస్‌లతో వచ్చిన క్రేజ్‌తో పలు సినిమా అవకాశాలు కూడా ఆమె వద్దకు చేరాయి. తమిళ్, హిందీ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే తాప్సీ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన లూప్ లపేటా చిత్రంలో నటించింది.

రాని హిట్ టాక్..
లూప్ లపేటా చిత్రం అనుకున్నంత హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఇందులో తాప్సీతోపాటు తాహీర్ రాజ్ భాసిన్ కూడా నటించాడు. ఈ సినిమా గురించి శ్రేయ ధన్వంతరి మాట్లాడుతూ ''నేను సినిమాలు చేయడానికి చాలా కారణాలున్నాయి. నాకు నటనపై ఆసక్తి ఎక్కువ. ఎలిప్పిన్, తనూజ, అతుల్ వంటి ప్రముఖులతో కలిసి నేను యాక్టింగ్‌లో మొదటి అడుగులు వేశాను. ఈ చిత్రం టైటిల్ చాలా లూపిగా ఉంది. కొత్త ప్రయోగాలు చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి సమయంలో లూప్ లపేటాలో నటించడం చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపింది.

సీతా రామం హీరోతో..
లూప్ లపేటా చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్స్, ఆయుష్ మహేశ్వరి సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉంటే ఇటీవల చుప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రేయా ధన్వంతరి. సీతా రామం ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల రుబాబ్ అనే వీడియో సాంగ్ లో నర్తించిన ఈ బ్యూటి అద్భుత్ సినిమాలో నటిస్తోంది.

బోల్డ్ ఫొటోలతో..
శ్రేయా ధన్వంతరిలో మంచి నటి మాత్రమే కాకుండా ఒక దర్శకురాలు కూడా ఉంది. ఏ వైరల్ వెడ్డింగ్ అనే మినీ సిరీస్ కు దర్శకత్వం వహించింది ఈ అమ్మడు. మోడల్ గా, నటిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటి. ఇక సినిమాలు, సిరీస్‌ల విషయం పక్కన పెడితే అప్పట్లో హోమ్లీగా కనిపించే శ్రేయ ధన్వంతరి.. ఇప్పుడు హాట్‌గా అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్ పెట్టి హీట్ పెంచుతోంది.

ఎద అందాలు ఫోకస్ అయ్యేలా..
శ్రేయా ధన్వంతరి చేసే ప్రతీ ఫొటో అందాల ప్రదర్శనకే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక తాజాగా సెల్ఫీ పిక్స్ దిగిన ఈ ముద్దుగుమ్మ ఘాటుగా ఎద అందాల ప్రదర్శన చేసింది. మెరూన్ కలర్ టాప్ వేసుకున్న ఈ తెలుగు నటి తలకు టవల్ చుట్టుకుని మరి పోజులిచ్చింది. బాల్కనీ నుంచి దిగుతున్న ఈ ఫొటోల్లో క్యూట్ గా స్మైల్ ఇస్తూనే ఎద అందాలు ఫోకస్ అయ్యేలా సెల్ఫీ తీసుకుంది. ఇలాంటి హాట్ ఫొటోలతో నెట్టింట్లో హీట్ రాజేస్తోంది ఈ హాట్ భామ.


Click it and Unblock the Notifications











