‘ఇప్పటి వాళ్లు చాలా స్పీడ్... అలాంటివి ముఖం మీదనే అడుగుతారు'

Actress Jyothi: తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఐటమ్ సాంగ్‌ నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రాచుర్యం సంపాదించిన నటి జ్యోతి, ఇటీవల 'కిస్సిక్ టాక్స్ విత్ వర్ష' టాక్ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంది. రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఆమె, చాలా రోజుల తర్వాత వర్ష టాక్ షోలో పాల్గొన నటి జ్యోతి సినిమా ఇండస్ట్రీలోని కమిట్‌మెంట్స్, తన కెరీర్ ప్రయాణం, ఎదురైన పరిస్థితులు, కలలు, నిరాశలు గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఇంతకీ ఏమన్నారంటే?

నటి జ్యోతి ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్, ఐటమ్ సాంగ్స్‌తో యూత్‌ను అలరించిన ఈ భామ. సినిమాల్లో అవకాశాలు రావాలంటే "కమిట్మెంట్లు" అవసరమనే హాట్ టాపిక్‌పై గురించి వర్ష ప్రశ్నించారు. దీనికి నటి జ్యోతి సమాధానమిస్తూ.. "అది కొంతవరకు నిజమే కానీ అందరూ అలాంటివారు కాదు" అని చెప్పింది. "ఇండస్ట్రీలోకి నేను 2003లో వచ్చాను. అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు చాలా మారిపోయాయి. నేను ఎప్పుడూ ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వలేదు. బలవంతం చేసిన వాళ్లు ఎప్పుడూ లేరు. నేను ఎక్కువగా కృష్ణారెడ్డి గారి సినిమాల్లోనే నటించాను. ఆయనని ఫాదర్‌లా చూసేదాన్ని అని జ్యోతి వెల్లడించింది.

Jyothi Opens Up on Film Industry Commitments Realities Missed Roles in Kissik Talks

ఇండస్ట్రీ రిలేషన్స్ గురించి మాట్లాడుతూ.. నాకు ఇష్టమైతేనే. అవతలి వ్యక్తితో రిలేషన్ షిప్. కానీ, నన్నెవరు బలవంతం పెట్టినవారు లేరు. అలాంటి ఇబ్బందులు ఎక్కడ ఎదుర్కోలేదు. వాస్తవానికి ఇలాంటివి ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. కానీ, సినిమా ఇండస్ట్రీపై అవతలి వారి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. నాకిష్టం ఉన్న వాళ్లతోనే రిలేషన్ కొనసాగించాను" అని జ్యోతి షాకింగ్ కామెంట్స్ చేసింది.

అలాగే "కమిట్మెంట్ ఉంటేనే ఛాన్స్ ఇస్తారు అనేది ప్రస్తుతానికి నిజం కాదు. ఇప్పుడు టాలెంట్ చూసే కాలం. అంతేకాదు, ఇవాళ్టి జనరేషన్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ జనరేషన్ అలాంటి విషయాల్లో చాలా స్పీడ్. నచ్చితే చేస్తారు, నచ్చకపోతే నేరుగా తిరస్కరిస్తారు. సోషల్ మీడియా పెరుగడంతో ఇప్పుడు ఎవ్వరూ ఓపెన్‌గా అలాంటి ఆఫర్లు అడగడానికి కూడా భయపడుతున్నారు. 'నీకు నన్ను గురించి చెప్పే హక్కు ఉందా?' అని తిరుగుబాటు చేసే అమ్మాయిలు పెరిగారు. అందుకే 'కాంప్రమైజ్ చేస్తేనే రోల్స్ వస్తాయి' అనేది ఇప్పుడు పూర్తిగా నిజం కాదు" అని ఆమె షాకింగ్‌గా చెప్పింది.

అదే సందర్భంలో, "ఎప్పుడైనా ఓ పాత్ర కోసం మనసులో బాధపడిన సందర్భాలున్నాయా?" అని యాంకర్ అడగడంతో.. "పుష్పలో అనసూయ చేసిన పాత్ర వచ్చుంటే బాగుండేది అనిపించింది. 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర కూడా నేను చేస్తే బాగుండేది అనిపించింది. ఆ జోనర్‌కు నేను న్యాయం చేయగలననే నమ్మకం ఉంది. అవకాశాలు రాకపోయినా నేను నిరాశ చెందలేదు. ఎందుకంటే సినీ జీవితంలో ఏ ఛాన్స్ ఎప్పుడు, ఎలా మన లైఫ్ మార్చేస్తుందో ఎవరూ చెప్పలేరు" అని జ్యోతి చెప్పింది.

అదే సమయంలో రవితేజ ఉదాహరణను ప్రస్తావిస్తూ.. "రవితేజ అంతటివాడికి 30 ఏళ్లు వరకు బ్రేక్ రాలేదు. మనం క్రమంగా ప్రయత్నం ఆపకుండా చేస్తూ ఉంటే ఎప్పటికో ఒకరోజు అవకాశాలు మన ముందుకి వస్తాయి" అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది. ప్రస్తుతం జ్యోతి చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఓపెన్‌గా ఇండస్ట్రీ రియాలిటీ చెప్పడంతో సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X