అమ్మ నుంచి అందాల బొమ్మగా.. గుప్పెడంత మనసు జ్యోతిరాయ్ ట్రాన్స్‌ఫర్మేషన్ షాకింగ్‌గా!

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో స్థిరపడటానికి, ఆర్థిక పరిస్థితులను ఎదురించడానికి కొందరు యాక్టర్లు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనే పనిలో తమకు సూట్ కానీ పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది. అలా తనకు లభించిన పాత్రల్లోనే జీవిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకొని.. తనలోని అసలు టాలెంట్‌ను కొందరు చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివారిలో టెలివిజన్ సీరియల్‌ తారగా మెప్పించిన జ్యోతిరాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ ఒకరు. ఆమె తాజాగా తన ఇమేజ్‌ను, గుర్తింపును మార్చుకొన్న ఈ అందాల భామ ట్రాన్స్‌ఫర్మేషన్ వివరాల్లోకి వెళితే..

జ్యోతిరాయ్ కెరీర్ విషయానికి వస్తే.. 2010 సంవత్సరంలో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించిన అందాల భామ.. తన వయసుకు మించి.. భారమైన పాత్రలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్‌లోని జగతి క్యారెక్టర్‌లో ఆమె కనిపించిన విధానం, ఆమె హుందాతనం, మెచ్యుర్డ్ యాక్టింగ్‌తో భారీగా అభిమానులను సంపాదించుకొన్నారు. ఆమెకు గుర్తింపు నిచ్చిన సీరియల్స్‌లో కన్నడ నాట కస్తూరీ నివాస, మూరు గంటూ, తమిళంలో కాత్రుక్కేన్న వెలి లాంటివి ఉన్నాయి.

Jyothi Rai

ఓ వైపు టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తూ.. వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. 2012లో బంగర్దా కురల్ సినిమా ద్వారా కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జ్యోతిరాయ్.. ఆ తర్వాత పదేళ్ల కాలంలో డజనుకుపైగా సినిమాల్లో నటించారు. అయితే తాజాగా తన ఇమేజ్‌కు భిన్నంగా ఆమె హీరోయిన్‌ అవతారం ఎత్తి తన అభిమానులను షాక్‌కు గురి చేశారు. ఇటీవల కాలంలో ఆమె మాస్టర్ పీస్, కిల్లర్ సినిమాల్లో లీడ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఏ మాస్టర్ పీస్ సినిమాలో జ్యోతిరాయ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆమె భర్త సుకు పూర్వాజ్ దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పుకోవాలి. భారీ సాంకేతికతతో ఇప్పటి వరకు తెలుగు తెర మీద రాని కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం హై స్టాండర్డ్ వీఎఫ్ఎక్స్ డిజైన్ చేస్తుండటం గమనార్హం.

హీరోయిన్‌గా జ్యోతి పూర్వజ్ నటిస్తున్న మరో సినిమా కిల్లర్. రోబొటిక్ టెక్నాలజీ కాన్సెప్ట్‌తో సైంటిఫిక్, ఫిక్షన్ అండ్ డివోషనల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ దక్కతున్నది. రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా జ్యోతి పుర్వజ్ పంచుకొన్నారు. ఇంకా పలు చిత్రాల్లో హీరోయిన్ స్థాయి పాత్రలతో ఆలరించేందుకు సిద్దమవుతున్నారు.

ఇదిలా ఉండగా, నిత్యం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటారు. తన గ్లామర్‌కు సంబంధించిన ఫోటోషూట్స్, రీల్స్‌తో నెటిజన్లకు కొత్త అనుభూతిని పంచుతుంటారు. తనకు లభించిన ఇమేజ్ చట్రం నుంచి బయటకు వచ్చి.. గ్లామర్ హీరోయిన్‌గా తెరపైన సంచలనం రేపుతుందనే విషయం కోసం వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: Killer a masterpiece jyothi rai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X