విజయ్ దేవరకొండతో లిప్‌లాకే కాదు.. దానికైనా రెడీ అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..
Actress Jyothi: టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి. సినిమాల్లో ఎక్కువగా నెగటివ్ షేడ్స్, వ్యాంప్ రోల్స్‌లో కనిపించిన ఆమె, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అయితే ఎక్కువ కాలం హౌస్‌లో నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉన్న వెబ్ సిరీస్‌లు, ఓటీటీ సినిమాలపై దృష్టి పెట్టింది. తాజాగా జ్యోతి ఒక ఇంటర్వ్యూ ద్వారా మరోసారి చర్చకు వస్తోంది. యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న 'కిస్క్ టాక్' షోలో పాల్గొన్న జ్యోతి, తన కెరీర్‌కి సంబంధించిన అనేక విషయాలు పంచుకుంది. అదే సమయంలో హీరో విజయ్ దేవరకొండపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏమన్నారంటే?
యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న 'కిస్క్ టాక్' షోలో పాల్గొన్న జ్యోతి, తన కెరీర్‌కి సంబంధించిన అనేక విషయాలు పంచుకుంది.ఈ సమయంలో "ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరితో నటించాలనుకుంటున్నారు?" అని వర్ష ప్రశ్నించగా, జ్యోతి వెంటనే 'విజయ్ దేవరకొండ" అని వెంటనే సమాధానం ఇచ్చింది. అంతటితో ఆగని వర్ష 'ఎలాంటి క్యారెక్టర్?' అని అడగగా, జ్యోతి "ఘాటైన రొమాంటిక్ మూవీలో నటించాలని ఉంది. విజయ్ దేవరకొండ గారు.. వినిపిస్తుందా?" అంటూ ఘాటైన కామెంట్ చేసింది.

వర్షా అక్కడితో ఆగకుండా.. "లిప్ కిస్ సీన్ వస్తే చేస్తారా?" ప్రశ్నించగా.. జ్యోతి ఏమాత్రం సంకోచం లేకుండా "తప్పకుండా చేస్తా. సీన్ డిమాండ్ చేస్తే.. దేనికైనా రెడీ.. ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ అయితే 100% రెడీ!" అని షాకింగ్ అన్సర్ ఇచ్చింది. ఇక జ్యోతి మాట్లాడుతూ.. "ఇవన్నీ తరువాత వైరల్ చేస్తారా ఏంటి? నాతో అన్ని నిజాలు చెప్పిస్తున్నారు" అంటూ నవ్వేసింది కూడా. "అర్జున్ రెడ్డి చూసినప్పటి నుంచి విజయ్ దేవరకొండ అంటే పిచ్చి.. ఒకరకంగా క్రష్!" అని కూడా చెప్పేసింది.
తరువాత వర్ష "ఇండస్ట్రీలో ఏ హీరోతో నటించలేకపోయానే అనే బాధ ఉందా?"మరో సూటి ప్రశ్న వేసింది. అప్పుడు జ్యోతి .. చిరంజీవి గారితో మరచిపోలేని అనుభవాన్ని గుర్తుచేసుకుంది. "నేను 'అందరివాడు' సినిమాలో చిరంజీవి గారితో నటించాను. ఆ సినిమా గురించి మేనేజర్ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నా. ఏ రోల్ అనేది అడగలేదే.. 'చిరంజీవి' అనే పేరు వినగానే ఊహల్లో తేలిపోయాను" అని చెప్పింది. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే... " సైట్ దగ్గరకు వెళ్లాక తెలుసుకున్నా.. నేను చిరంజీవి గారిని రిజెక్ట్ చేసే పాత్ర! పెళ్ళి చూపుల సీన్ లో 'నాకు మీరు నచ్చలేదు.. వేరొకరిని పెళ్లి చేసుకుంటా' అని చెప్పాలి" అని ఆ సీన్ గురించి వివరించింది.
"సీన్ చేసేసి ఇంటికి వెళ్లాక అద్దం నిలబడి చిరంజీవిని కాదనడం ఏంటి? తూ..' అని నన్ను నేనే తిట్టుకున్నానని నవ్వుతూ చెప్పింది. ఆ సీన్ చేస్తున్నంతసేపు 'చిరంజీవిలాంటి ఐకాన్‌ని వదిలి పక్కనున్న బండోడిని పెళ్లి చేసుకుంటానంటావా?' అని లోపలనే నన్ను నేనే తిట్టుకుంటూ చేశా"అని అందరివాడు సినిమా సన్ని వేశాన్ని గుర్తు చేసుకుంది. జ్యోతి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ.. లిప్‌లాక్‌కైనా రెడీ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.


Click it and Unblock the Notifications











