Suriya Jyothika: సూర్యతో విడాకుల విషయంలో బిగ్ ట్విస్ట్... పర్సనల్ వీడియో రిలీజ్ చేసిన జ్యోతిక

సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎప్పుడు నెట్టింట్లో వింటూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఈ మధ్య అవి మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిగ్​ సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకున్నట్లు అఫీషియల్​ అనౌన్స్​మెంట్స్​ వస్తుండగా, మరికొందరు తీసుకోబోతున్నారనే పుకార్లు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి రూమర్స్​ లిస్ట్​లో ప్రస్తుతం స్టార్ కపుల్ సూర్య-జ్యోతిక కూడా ఉన్నారు. సౌత్ సూపర్ స్టార్స్ అయిన వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ వార్తలకు జ్యోతిక ముగింపు పలికింది. వివరాల్లోకి వెళితే..

రియల్​ లైఫ్​లో క్యూట్ పెయిర్​గా : తమిళ స్టార్స్ సూర్య , జ్యోతికలు మధ్య చక్కటి భార్యభర్తల అనుబంధం ఉంది. 2006, సెప్టెంబరు 11న వివాహబంధంతో ఒకటైన ఈ జంటకు సినీ అభిమానుల్లో ఉండే క్రేజ్‌ వేరు. రీల్​ లైఫ్​లో వీరిద్దరూ తమ యాక్టింగ్​తో అభిమానుల మనసును ఎంతగా దోచుకున్నారో.. రియల్‌ లైఫ్‌లో కూడా అంతే క్యూట్‌ జంటగా మంచి పేరు తెచ్చుకున్నారు.

Jyothika Finland Vacation With Suriya Video Shared on Her Instagram

పిల్లల కోసమే కలిసి ఉన్నట్టుగా : అయితే కొంత కాలంగా వీరి పర్సనల్ లైఫ్​కు సబంధించి చాలా వార్తలు వైరల్ అవుతూనే వస్తున్నాయి. ఈ స్టార్ కపుల్​ విడిపోతున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే ఈ జంట ముంబయ్​కు షిప్ట్ అయ్యారని, అక్కడ కూడా విడివిడిగా ఉంటున్నారని కథనాల్లో వస్తున్నాయి. పిల్లల కోసమే కలిసి ఉంటున్నట్టు నటిస్తున్నారని టాక్​ కూడా వినిపించింది.

ఒక్క వీడియోతో చెక్​ : అయితే ఈ డివర్స్​ పుకార్ల నేపథ్యంలో జ్యోతిక తన ఇన్​స్టా అకౌంట్​లో ఓ వీడియోను విడుదల చేశారు. రీసెంట్​గా ఈ జంట ఫిన్లాండ్ టూర్​కు వెళ్లారు. ఇప్పుడా ఆ పర్యటన వీడియోనే '2024 -(A year full of travel-ప్రయాణంతో నిండిన సంవత్సరం)' అనే క్యాప్షన్​తో జ్యోతిక పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సూర్య జ్యోతిక హాలిడే ట్రిప్​ను కలిసి బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. అలా ఈ వీడియో ద్వారా తమ గురించి వస్తున్న పుకార్లకు చెక్​ పెట్టారని అర్థమవుతోంది. తమ విడాకులకు సంబంధించి ఏ మాత్రం నిజం లేదని, తమ బంధం చాలా గట్టిదని అనే అర్థం వచ్చేలా జ్యోతిక ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Jyothika Finland Vacation With Suriya Video Shared on Her Instagram

చాలా ట్రిప్​లకు : నటులుగా, నిర్మాతలుగా ఎంతో బిజీగా గడిపే సూర్య, జ్యోతిక అప్పుడప్పుడు తమ పిల్లలు దియా, దేవ్‌లతో కలిసి హాలీడే ట్రిప్‌లకు వెళ్తుంటారు. అలా ఈ సారి కూడా తమ పనులకు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఈ టూర్​కు సూర్య జ్యోతిక వెళ్లారు.

సినిమాల విషయానికొస్తే.. జ్యోతిక రీసెంట్​గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో కలిసి 'కాథల్: ది కోర్' అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్​లో 'షైతాన్' చిత్రం కోసం సిద్ధమవుతోంది. ఇందులో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య త్వరలోనే కంగువా చిత్రంతో ఆడియెన్స్​ ముందుకు రానున్నారు దీని తర్వాత ఓం ప్రకాశ్ మెహతా, సుధా కొంగరతోనూ చెరో సినిమా చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X