'ఖుషి 2'కి కూడా సై అంటున్న సీనియర్ హీరోయిన్!
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జ్యోతిక సూర్యని వివాహం చేసుకుని స్థిరపడింది. వివాహం తరువాత జ్యోతిక కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. కానీ ఇటీవల జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి దూసుకుపోతోంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది.
కాగా నేడు జ్యోతిక నటించిన మరో చిత్రం కాట్రిన్ మొళి విడుదలవుతోంది. ఈ సందర్భంగా జ్యోతిక ప్రచురకార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. మంచి పాత్రలు వస్తే నటన కొనసాగిస్తానని జ్యోతిక తెలిపింది. తనకు సరిపోయే పాత్రలతో నిర్మాతలు వస్తే నటించడానికి అభ్యంతరం లేదని జ్యోతిక పేర్కొంది. ఖుషి 2 గురించి వార్తలు వస్తున్నాయి. అవకాశం వస్తే ఆ చిత్రంలో కూడా నటిస్తానని జ్యోతిక చెప్పడం విశేషం.

విజయ్, జ్యోతిక నటించిన ఖుషి చిత్రం 2000లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో పవన్ కళ్యాణ్, భూమిక నటించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఖుషి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











