నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్.. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ!
కింగ్ నాగార్జున చివరగా నటించిన చిత్రం ఆఫీసర్. ఆర్జీవీ దర్శకతంలో తెరకెక్కిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ నాగార్జున వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఇటీవల రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున మన్మథుడు 2 చిత్రాన్ని ప్రారంభించాడు. 2002లో వచ్చిన నాగార్జున సూపర్ హిట్ చిత్రం మన్మథుడుకి ఇది సీక్వెల్. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా ఉండగా నాగార్జున మరో సీక్వెల్ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాడు. 2016 సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రంలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు అద్భుతమైన స్పందిన వచ్చింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రానికి బంగార్రాజు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా నయనతారని తీసుకోవాలనుకున్నారు. ఆమె నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనితో చిత్ర యూనిట్ ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ జ్యోతికని సంప్రదించినట్లు తెలుస్తోంది. జ్యోతిక నుంచి సమాధానం రావాల్సి ఉంది. 15 ఏళ్ల క్రితం నాగార్జున, జ్యోతిక కలసి మాస్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ జంటగా నటించే అవకాశం వచ్చింది. మరి జ్యోతిక బంగార్రాజు చిత్రానికి ఓకే చెబుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











