కియారా అద్వానీ పై కబీర్ సింగ్ ఎఫెక్ట్.. సందీప్ చేసిన ఆ పనితో!
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవ్వరి జాతకం ఎలా టర్న్ అవుతుందో ఊహించడం కష్టం. అందం, అభినయం అన్నీ ఉండటమే గాక శక్తికి మించి ప్రయత్నాలు చేసినా కొందరికి సక్సెస్ అనేది అందని ద్రాక్ష గానే మిగిలిపోతుంది. కానీ కొందరి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంటుంది. కేవలం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ వచ్చేస్తుంది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ అదే జరిగింది. కబీర్ సింగ్ ఎఫెక్ట్ కియారా అద్వానీ పై బాగా పడింది.

కబీర్ సింగ్ లో కియారా బోల్డ్‌నెస్
అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కబీర్ సింగ్. బాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త టేస్ట్ పరిచయం చేస్తూ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటనతో పాటు లిప్ లాక్స్, బోల్డ్ సీన్స్ యూత్ ఆడియన్స్‌కి మంచి కిక్కిచ్చాయి. మరీ ముఖ్యంగా కియారా గ్లామర్ డోస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

కియారా అద్వానీ చుట్టే..
కబీర్ సింగ్‌లో కియారా అద్వానీ బోల్డ్ నెస్ చూసి బాలీవుడ్ బడా డైరెక్టర్లు సైతం ఫ్లాట్ అయ్యారట. ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారట దర్శకనిర్మాతలు. కియారా క్రేజ్ కాష్ చేసుకోవాలని ఆమెతో సినిమాలు రూపొందించేందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చుపుతున్నారట. ఓ రకంగా చూస్తే కబీర్ సింగ్ ఎఫెక్ట్ కియారా లైఫ్‌ని టర్న్ చేసిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లిస్ట్ చూస్తే కియారా పేరే ముందుగా వినిపిస్తోంది.

కరణ్ జోహార్ ఆఫర్
కియారా అద్వానీ అభినయనానికి ఫిదా అయి బాలీవుడ్ ఇప్పటికే కరణ్ జోహార్ ఆమెకు రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మలకు పెళ్ళై పోవడం కూడా కియారాకు బాగా కలిసొచ్చే అంశంగా మారింది. అంతేగాక భాషతో సంబంధం లేకుండా ఎలాంటి సినిమాల్లోనైనా నటించేందుకు కియారా ఓకే చెబుతుండటంతో దర్శక నిర్మాతలు ఆమెనే కోరుకుంటున్నారు.

మొహమాటం లేకుండా లిప్‌లాక్స్
బోల్డ్ పాత్రల్లో నటించేందుకు, లిప్‌లాక్స్ చేసేందుకు ఎలాంటి మొహమాటం లేదని కియారా నిర్మొహమాటంగానే చెప్పేయడం ఆమె కెరీర్‌ని టర్న్ చేసేసింది. పైగా లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లలో కియారా చేసిన క్యారెక్టర్ ఆమెలోని డేర్‌నెస్‌ని, నటనా ప్రతిభను బయటపెట్టింది. అయితే తన డిమాండ్ పసిగట్టిన కియారా.. రెమ్మ్యూనరేషన్ కూడా బాగానే డిమాండ్ చేస్తోందట.

కబీర్ సింగ్ కలెక్షన్ల సునామీ
మరోవైపు షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో వచ్చిన కబీర్ సింగ్ సినిమా కబీర్ సింగ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 250 కోట్ల మార్క్ దాటేసిన కబీర్ సింగ్.. ఈ ఏడాది ఇప్పటివరకు బాలీవుడ్ లో రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











