ఇండియానే ఊపేసి.. ఇప్పుడు బార్‌లో డ్యాన్సర్‌గా.. దారుణంగా టాప్ హీరోయిన్ జీవితం
ఓడలు బళ్లు.. బళ్లు ఓడలుగా మారడం అనే సామెత అప్పుడప్పుడు కొందరినీ చూస్తే నిజమని అనిపిస్తుంది. రాజులాగా బతికిన వారు పూట గడవని స్థితిలో బండి నెట్టుకొస్తున్న వారెందరో. ఇక చిత్ర పరిశ్రమలో ఉన్న వారి జీవితం ఎప్పుడెలా మారుతుందో తెలియదు. విలాసవంతమైన జీవితం గడిపి చివరి రోజుల్లో పేదరికంతో అష్టకష్టాలు పడినవారు ఎందరో. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన డ్యాన్స్‌లు, అందంతో ఒకప్పుడు ఇండియాను ఊపేసి.. ఇప్పుడు దేశం కానీ దేశంలో బార్‌లో డ్యాన్సర్‌గా కనిపించి షాకిచ్చింది. ఆమె ఎవరు? జీవితం ఒక్కసారిగా ఎందుకు తారుమారైంది? ఈ వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా క్రేజ్
సోషల్ మీడియా రాకతో దేశంలో ఇన్‌ఫ్లూయెన్సర్లుగా, స్టార్లుగా సెలబ్రెటీ రేంజ్ ఎంజాయ్ చేస్తోంది కుర్రకారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు పంజాబీ ముద్దుగుమ్మ అంజలి అరోరా. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చేస్తూ తన ప్రతిభతో స్టార్‌డమ్ అందుకున్నారు అంజలి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భువన్ బద్యాకర్ అనే వ్యక్తి తన బైక్‌పై పల్లీల మూట వేసుకుని వీధుల వెంట తిరుగుతూ వాటిని విక్రయించేవాడు. ఈ క్రమంలో జనాన్ని ఆకట్టుకునేందుకు గాను ఓ పాట రాసుకుని, దానికి సొంతం ట్యూన్ కట్టి వీధుల వెంట తిరిగేవాడు. ఈ క్రమంలోనే భువన్ పాటను ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

కచ్చాబాదంతో సెన్షేషన్
ఆ పాటకు తనదైన శైలిలో నడుము తిప్పుతూ, తన అందాలు ఆరబోస్తూ అంజలి అరోరా చేసిన వీడియో ఇండియాను షేక్ చేసింది. యూట్యూబ్‌లో కచ్చా బాదామ్ అంటూ ఇప్పటికీ ఆ వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఒక్క పాట దెబ్బకి అంజలి పేరు మారుమోగిపోయింది, అలాగే పాట రాసి ట్యూన్ కట్టిన భువన్‌ని కూడా ఫేమస్ చేసింది. కచ్చా బాదం పాట దెబ్బకు అంజలి అరోరాకు అవకాశాలు క్యూకట్టాయి. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ హెస్ట్‌గా వ్యవహరించిన లాక్ అప్ గేమ్ షోలో ఛాన్స్ కొట్టేసింది. అందులో మునావర్ ఫరూఖీతో క్లోజ్‌గా తిరిగింది. బిగ్‌బాస్ హిందీ ఓటీటీ 3లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దొరికినప్పటికీ రిజెక్ట్ చేసింది.
కోట్లు సంపాదించిన అంజలి
బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌తో అంజలికి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ది లవ్ ఈజ్ ఫరెవర్, దివాళియాన్, డెలియాన్ చిత్రాల్లో ఆమె నటించింది. చిన్న వయసులోనే బోల్డెంత వెనకేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు, షోలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా కోట్లలో సంపాదించిందని బుల్లితెర వర్గాల టాక్. అయితే ఇటీవల పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో పయనిస్తోన్నారు అంజలి అరోరా.. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. అయితే అంజలి అరోరాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పబ్‌లో డ్యాన్సర్‌గా ప్రత్యక్షం
థాయిలాండ్‌లోని పటాయాలో ఉన్న ఓ పబ్‌లో క్లబ్ డ్యాన్సర్స్‌తో కలిసి అంజలి అరోరా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇండియాలో అంతటి స్టార్‌డమ్‌ను వదిలిపెట్టి థాయిలాండ్‌లో, అది కూడా ఓ పబ్‌లో ఆమె ఎందుకు డ్యాన్స్ చేస్తోందంటూ నెటిజన్లు అవాక్కయ్యారు. సినిమాలలో, బుల్లితెరపై అవకాశాలు తగ్గడంతో అంజలి ఇలా డ్యాన్స్ షోలు చేసుకుంటోందని వారు కామెంట్స్ పెడుతున్నారు. తన వృత్తిని ఆమె కొనసాగిస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అప్పుడు కచ్చా బాదం సాంగ్‌తో ఎంత ఫేమస్ అయ్యిందో? ఇప్పుడు పటాయాలోని పబ్‌లో డ్యాన్స్ చేసి అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించారు అంజలి. అయితే ఆమె పటాయా ఎందుకు వెళ్లారు? ఎందుకు పబ్‌లో డ్యాన్స్ చేశారు? అన్నది మాత్రం తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











