వైసీపీ నేతలపై నటి కాదంబరి జెత్వానీ సంచలన ఆరోపణలు.. కిడ్నాప్ చేసి అలా చంపేసే ప్రయత్నం!

ఆంధ్ర ప్రదేశ్‌లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో ఆ పార్టీ నేతలు, పోలీస్ అధికారుల చేతిలో చిత్ర హింసలకు గురైన బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ హైదరాబాద్‌కు చేరుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముందుకొచ్చిన ఈ నటి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విచారణకు సహకరించేందుకు నటి హైదరాబాద్‌కు చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ..

ఏపీ సీఎం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు ముంబైకి వెళ్లారు. ప్రభుత్వం తరఫున ఆమెకు భరోసా ఇచ్చి.. హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఓ దశలో భోరున విలపించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోని అధికారులు, నేతలపై సంచలన ఆరోణలు చేస్తూ.. ఈ కేసులో చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తుందనే భరోసాను ఆమె వ్యక్తం చేశారు.

Kadambari Jetwani sensational allegations on YSRCP Government over physical torture and fake case

కాదంబరి జెత్వానీ మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన నాకు భేషరతుగా మద్దతు తెలిపిన తెలుగు మీడియాకు ధన్యవాదాలు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. గత ఏపీ ప్రభుత్వంలోని పవర్‌ఫుల్ వ్యక్తులు, వివిధ హోదాలో కొనసాగుతున్న నేతలు తమ అధికారం, చట్టం, న్యాయాన్ని, తమ పరిచయాలను దుర్వినియోగం చేశారు. చట్టవ్యతిరేకంగా నా క్యారెక్టర్‌ను చంపేశారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం, భారత్ సర్కార్ న్యాయం చేస్తుందని ఆశాభావం ఉందని ఆమె అన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వాలు నాకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం ఉంది. దోషులను కఠినంగా శిక్షిస్తుంది. భవిష్యత్‌లో మహిళలపై ఇలాంటి అరాచకాలు జరగకుండా చర్యలు తీసుకొంటారని నమ్మకం ఉంది. దర్యాప్తు, విచారణ జరుగుతున్న తీరుపై పూర్తి విశ్వాసం ఉంది. 70 ఏళ్లకుపైగా వయసు ఉన్న నా తల్లిదండ్రులను దారుణంగా హింసించారు. నా కుటుంబం నోరు నొక్కేసింది అని అన్నారు.

నాపై ఫేక్ కేసు నమోదు చేశారు. నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. నాపై భూటకపు కేసుల నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది ఆర్థికంగా, ఇతర మార్గాల్లో ప్రయోజనాలు పొందారు. ఈ కేసులో చాలా వివరాలు బయటకు వస్తాయి. నాకు, నా ఫ్యామిలీకి రక్షణ కల్పించాలి అని ప్రభుత్వాన్ని వేడుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X