ఆ హీరోతో బెడ్రూమ్ సీన్లు.. ఇంకెప్పుడూ అతనితో పని చేయను..కాజల్ సెన్సేషనల్ కామెంట్స్
Recommended Video
టాలీవుడ్ చందమామ.. ఆల్చిప్పల్లాంటి తన కళ్లతో ఎంతోమందిని కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచినా.. చెక్కు చెదరని అందంతో దూసుకుపోతోంది. ఇప్పటికీ క్రేజీ ఆఫర్లతో కొత్త వచ్చే వారికి గట్టి పోటీనిస్తోంది.

రీసెంట్ సీత, కోమలితో
రీసెంట్‌గా తెలుగు ప్రేక్షకులను సీత చిత్రంతో పలకరించగా.. కోలీవుడ్ ప్రేక్షకులను కోమలి చిత్రంతో మెప్పించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన సీత అంతగా విజయాన్ని సాధించకపోయినా.. కాజల్‌కు మాత్రం మంచి పేరే వచ్చింది. ఇక కోమలి చిత్రం తమిళ్‌లో మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో కాజల్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అలాంటి సీన్లతో ఇబ్బంది పడ్డా..
2016లో చేసిన హిందీ చిత్రం దో లప్జోంకి కహాని సినిమా సంగతులను వివరిస్తూ... తాను ఆ చిత్రంలో అంధురాలి పాత్రను పోషించినట్లు, బెడ్‌పై రొమాంటిక్ సీన్స్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించిందని, అంధురాలి పాత్రలో ఉండి, ఎవరో తెలియన వ్యక్తితో అలా రొమాన్స్ చేయడం తనకు నచ్చలేదని తెలిపింది.

ఆయనతో పని చేయను..
అలాంటి పాత్ర.. రొమాన్స్ చేయడం తనకు నచ్చలేదని అయినా దర్శకుడు దీపక్ టీజోరి చెప్పాడని చేశానని.. మరోసారి ఆయనతో కలిసి పని చేయలేనని నిర్మొహమాటంగా చెప్పేసింది. తెరపై ఎప్పుడూ హద్దులు దాటని ఈ చందమామా.. స్కిన్ షోను కూడా అంతగా ప్రోత్సహించదు. అవసరమైన మేరకే రొమాంటిక్ సీన్లలో నటించేందుకు అంగీకరిస్తుందన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











