For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం హాట్ ట్రీట్ ఇచ్చిన కాజల్.. ఓన్లీ బ్రాతో స్విమ్మింగ్ పూల్ లో?

  |

  టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని ముంబై కి చెందిన గౌతమ్ కిచ్లు అనే వ్యక్తి ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ ఫాలో అవుతూ పెళ్లి చేసుకున్నా సరే ఆమె సినిమాలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఎప్పటిలాగే సినిమాలు చేస్తూ ఆమె అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా కాజల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  పెళ్లైనా వినకుండా

  పెళ్లైనా వినకుండా


  ఒక రకంగా కుర్రహీరోయిన్ల ఎంట్రీ తో కాజల్ లాంటి హీరోయిన్ల హవా టాలీవుడ్ లో తగ్గిందనే చెప్పాలి. పూజా హెగ్డే, రష్మిక మందన్నా, కియారా అద్వానీ లాంటి కొందరు కుర్ర హీరోయిన్ల హవా తో కాజల్ లాంటి సీనియర్ హీరోయిన్లు సీనియర్ హీరోల కే పరిమితం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.. తన మార్కెట్ నెమ్మదిగా నష్టపోతోంది అనే విషయం తెలుసుకున్న కాజల్ వెంటనే వివాహబంధం లోకి అడుగుపెట్టింది.. అయితే పెళ్లి అయ్యాక కూడా ఆమె సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు.. కానీ ఒక రకంగా ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి.

  టాలీవుడ్ లో హవా


  తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఆ సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ అనే సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడంతో స్టార్ హీరోయిన్గా చాన్నాళ్ల పాటు టాలీవుడ్ లో హవా కొనసాగించింది. అయితే కాజల్ చేస్తున్న సినిమాలు వరుసగా పరాజయం పాలవుతూ రావడంతో పాటు కుర్రహీరోయిన్ల ఎంట్రీతో ఈమె ప్రభ మసకబారింది అని చెప్పొచ్చు.

  అవకాశాల కోసమేనా


  అందుకే ఎవరూ ఊహించని విధంగా పెళ్లయ్యాక ఇప్పుడు ఈ భామ హాట్ షో కి తెరలేపింది. ఇప్పటి వరకు పెళ్లి తరువాత కాస్త ఘాటు అందాలను ఎక్కడా ఆరబోసిన దాఖలాలు లేవు కానీ ఈ రోజు మాత్రం ఏకంగా స్విమ్మింగ్ పూల్ లో బ్రా తో కనిపించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కాజల్. ఎక్కడ ? ఎందుకు? ఏమిటి? అనే విషయాలను మాత్రం షేర్ చేయకుండా స్విమ్మింగ్ పూల్ లో రెండు చేతులు పైకి ఎత్తి ఒక ఫోటో, అలాగే వెనక నుంచి తీసిన మరో ఫోటో తన ఫాలోవర్స్ తో పంచుకుంది. దానికి తగ్గట్టు ఒక కొటేషన్ కూడా రాసుకొచ్చింది ఈ భామ. బహుశా సినిమా అవకాశాల కోసమే కాజల్ మళ్లీ ఈ హాట్ షోకి తెరలేపింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి అనుకోండి అది వేరే విషయం.

  రెండు సినిమాలు వర్కౌట్ కాలేదు

  ఆమె చివరిగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు అనే సినిమాలో కనిపించింది. అనూహ్యంగా సినిమాలో మంచు విష్ణు అక్క పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో కాజల్ పాత్ర కూడా అంతే హైలైట్ అనిపించదు అనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లో కూడా ముంబై సాగ అనే సినిమాతో అలరించే ప్రయత్నం చేసింది. కాని ఆ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆమె తర్వాత చేస్తున్న సినిమాల మీద దృష్టి పెట్టింది.

  Recommended Video

  Kajal Aggarwal, Gautam Takes Blessing From Chiranjeevi In Acharya Set
  సినిమాల విషయానికొస్తే

  సినిమాల విషయానికొస్తే

  ఇక కాజల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శంకర్ కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు సీక్వెల్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక శంకర్ కమల్ హాసన్ సినిమా షూటింగ్ విషయానికి వస్తే అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక తమిళంలో కూడా ఈ భామ మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతోంది.

  English summary
  Kajal Agrawal who married Gautam recently is quite active on social media now a days. she shared her bikini pics in her latest vacation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X