Kajal Agarwal: భగవంత్ కేసరి నుంచి కాజల్ ఫస్ట్ లుక్.. ఎంతో అందంగా బర్త్ డే గిఫ్ట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వరుస చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు స్టార్లుగా హవా చాటారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో టాలీవుడ్‌లో ఎంతో ప్రభావాన్ని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించి విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. వివాహం, ప్రెగ్నెన్సీ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తాజాగా బాలయ్య భగవంత్ కేసరి మూవీ నుంచి ఆమెకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

లక్ష్మీ కల్యాణం సినిమా తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుని తన సత్తా చూపించింది కలువ కళ్ల భామ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ అనే సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడంతో స్టార్ హీరోయిన్ గా చాలా కాలం పాటు టాలీవుడ్ లో హవా కొనసాగించింది. సినిమాలు తక్కువగా ఉన్న సమయంలో వ్యాపారవేత్త నీల్ కిచ్లును పెళ్లాడి ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇంతకాలం ఫ్యామిలీతో గడిపిన ఈ బ్యూటి ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

Kajal Agarwal First Look Released From Balakrishna Bhagawanth Kesari On Birthday

ఇటీవల ఘోస్టీ సినిమాతో ప్లాప్ అందుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రంతోపాటు కాజల్ 60వ చిత్రంగా తరకెక్కింది సత్యభామ. గూఢచారి, మేజర్ సినిమాల డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పిస్తున్న ఈ సినిమా టీజర్ ను జూన్ 19న కాజల్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. అఖిల్ డేగల డైరెక్ట్ చేసిన ఈ టీజర్ ఎంతో క్యూరియాసిటీ పెంచింది. ఇక కాజల్ చేస్తున్న మరో సినిమా భగవంత్ కేసరి.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భగవంత్ కేసరి మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చేతిలో బుక్ మరోవైపు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న కాజల్ అగర్వాల్ అందంగా దర్శనం ఇచ్చింది. ఇక స్పెక్ట్స్ పెట్టుకుని కాజల్ చిరునవ్వు అభిమానుల మనసు దోచేలా ఉంది. చార్మింగ్ కాజల్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X