Kajal Agarwal: కొడుకు చేసిన పనికి షాక్ అయన కాజల్ అగర్వాల్.. క్యూట్ వీడియో వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. సినీ కెరీర్ బాగా సాగుతున్న క్రమంలోనే వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మహారాష్ట్రలోని ముంబై కి చెందిన గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను 2020లో కాజల్ అగర్వాల్ ప్రేమ వివాహం చేసుకుంది. ఇక గతేడామి ఏప్రిల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్. తన కుమారుడికి నీల్ కిచ్లు అని నామకరణం చేసిన కాజల్ అగర్వాల్ అప్పుడప్పుడు తన గ్లామర్ పిక్స్ తో పాటు ఫ్యామిలీ ఫొటోలు కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా తన తొమ్మిది నెలల కొడుకు చేసిన పనికి మురిసిపోతున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది.

 టాలీవుడ్ లో ఎంతో ప్రభావం..

టాలీవుడ్ లో ఎంతో ప్రభావం..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వరుస చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు స్టార్లుగా హవా చాటారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో టాలీవుడ్‌లో ఎంతో ప్రభావాన్ని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిడమే కాకుండా.. అభిమానులను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటోంది.

కాజల్ అందానికి ఫిదా..

కాజల్ అందానికి ఫిదా..

హీరోయిన్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ముందే గ్లామరస్ బ్యూటి కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలో అలరించింది. మోడలింగ్ లో సత్తా చాటుతున్న సమయంలోనే 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా తెరగేంట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ అందానికి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. దీంతో మొదటి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది ఈ భా

స్టార్ హీరోల సరసన నటిస్తూ..

స్టార్ హీరోల సరసన నటిస్తూ..

లక్ష్మీ కల్యాణం సినిమా తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుని తన సత్తా చూపించింది కలువ కళ్ల భామ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ అనే సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడంతో స్టార్ హీరోయిన్ గా చాలా కాలం పాటు టాలీవుడ్ లో హవా కొనసాగించింది.

కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు ప్రేమాయణం..

కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు ప్రేమాయణం..

కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోలతోనే కాకుండా వయసులో ఆమె కన్న తక్కువ ఉన్న హీరోలతో కూడా రొమాన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. అలాగే కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ వంటి పలు భాషల్లోనూ వరుసగా సినిమాలు చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను పెంచుకుంది. ఈ క్రమంలోనే కెరీర్ ఫామ్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో సీక్రెట్‌గా లవ్ ట్రాకును నడిపించింది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.

ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డకు..

ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డకు..

ఇలా ఏళ్ల పాటు అతడితో ప్రేమలో విహరించిన తర్వాత, సినీ కెరీర్ కాస్తా డల్ గా సాగుతుందన్న క్రమమంలో గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది కాజల్ అగర్వాల్. ప్రియుడిని పెళ్లాడిన రెండేళ్ల తర్వాత కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఈ బ్యూటీ నాగార్జున 'ది ఘోస్ట్' సహా పలు చిత్రాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన కుమారుడితోనే సమయాన్ని గడుపుతోంది.

వర్కౌట్ చేస్తున్న కాజల్ కొడుకు..

ఈ మధ్య సినిమాలకు గ్యాప్ తీసుకున్న కాజల్ అగర్వాల్ తన గ్లామర్ ఫొటోలతో పాటు కొడుకుతో గడుపుతున్న మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన కొడుకు నీల్ కిచ్లు చేసిన పనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలో కాజల్ కొడుకు వర్కౌట్ చేస్తున్నట్లుగా స్టిల్ ఇచ్చాడు. అది ఫ్లాంక్ మాదిరిగా ఉండటంతో కొడుకు చేసిన వర్కౌట్ ను చూసి మురిసిపోతుంది కాజల్ అగర్వాల్. ఈ వీడియోకు "అతను దేనికి ట్రైనింగ్ తీసుకుంటున్నాడో అని ఆశ్చర్యపోతున్నా" అని క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ బ్యూటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X