Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కొత్త బిజినెస్‌లోకి కాజల్ అగర్వాల్.. ఎలాంటి వ్యాపారం ఎంచుకొన్నారంటే!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కెరీర్‌కు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి సరికొత్త ప్లాన్స్‌తో ముందుకెళ్తున్నారు. ఇటీవల ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్ ప్రణాళికలను, పెళ్లి తర్వాత తన జీవితం గురించి పలు విషయాలు పంచుకొన్నారు. కాజల్ అగర్వాల్ ఏం చెప్పారంటే...
మెడిటేషన్‌తో జీవితం ఆహ్లాదకరంగా
గత కొద్ది సంవత్సరాలుగా నా గురించి నేను వెతుక్కోవడం ప్రారంభించాను. మెడిటేషన్ నా జీవితంలో భారీ పాత్రను పోషిస్తున్నది. నీకు నీవుగా ఎస్టాబ్లిష్ కావడానికి మెడిటేషన్ చాలా ఉపయోగపడుతున్నది. నేను మైత్రేయ దాదాశ్రీజీని బోధనలను అనుసరిస్తుంటాను. ఆయన రాసిన పుస్తకం ది కాజ్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ ది ల్యాక్ ఆఫ్ లవ్ అనే పుస్తకం నాపై ప్రభావితం చేసింది అని కాజల్ తెలిపారు.
గౌతమ్‌తో పెళ్లి తర్వాత జీవితం..
గౌతమ్‌తో పెళ్లి తర్వాత జీవితం అమేజింగ్. పెళ్లి తర్వాత నా అలవాట్లు, జీవనశైలి అంతా మారిపోయింది. బిజీగా ఉన్నప్పటికీ మేమిద్దరం కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాం. జీవిత భాగస్వామి పర్ఫెక్ట్గా ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుందనే విషయం గౌతమ్ లాంటి భర్త దొరికిన తర్వాత స్పష్టమైంది అని కాజల్ తెలిపారు.
మా పేరుతో హ్యాష్ ట్యాగ్ బ్రాండ్‌గా
నా పెళ్లి సమయంలో మా ఇద్దరి పేర్లు కలిపి కిచ్డ్ (Kitched) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది .ఇప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్‌తో హిచ్డ్ (hitched) పదం ఇప్పుడు మా హోం డెకర్స్ వ్యాపారానికి బ్రాండ్‌గా మారింది. కొత్త రకమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం అని కాజల్ అన్నారు.
గేమింగ్ కంపెనీలో పెట్టుబడులు
ప్రస్తుతం ఓ గేమింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాను. ఒకీ గేమింగ్ అనే కంపెనీ ద్వారా భారతీయ ఆటలను వినియోగదారులకు అందిస్తున్నాం. కేరళలో దహి హండి, వల్లం కాలి అనే సంప్రదాయ ఆటలను గేమ్స్ ద్వారా పరిచయం చేయనున్నాం అని కాజల్ తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు.