Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ హీరోతో లిప్‌లాక్ అందుకే చేశా.. ముద్దులతో నాకు నష్టమే.. కాజల్ అగర్వాల్
దక్షిణాదితోపాటు బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్ వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. తాను పోషించే పాత్రల పట్ల కాజల్ కచ్చితమైన నియమాలను పాటిస్తారు. అసభ్యకరమైన సీన్లు, అనవవసరపు లిప్‌లాక్‌కు ఒప్పుకోరనే పేరు కాజల్‌కు ఉంది. తాజాగా లిక్లాక్లకు దూరంగా ఉండటంపై ఆమె వివరణ ఇస్తూ..
సినిమాలో కిస్సింగ్ సీన్ గురించి
నటనపరంగా, కొన్ని సీన్లపరంగా నాకు కొన్ని పరిమితులను పెట్టుకొన్నాను. అందుకే చాలా సినిమాల్లో కొన్ని సీన్ల కారణంగా తప్పుకొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే దో లఫ్జోం కి కహానీ సినిమాలో రణ్దీప్తో లిప్‌లాక్ చేయాల్సిన సీన్ వచ్చింది. అయితే ఆ సీన్‌కు ఉన్న ప్రాధాన్యం కారణంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ లిప్‌లాక్‌కు ప్రధాన కారణం మరో సినిమా అని పేర్కొన్నారు.
అమితాబ్, రాణి ముఖర్జి సీన్ స్ఫూర్తి
తెరపైన లిప్‌లాక్ సీన్ పెట్టుకొన్న అసభ్యంగా ఉండని సీన్ నాకు అమితాబ్, రాణిముఖర్జి నటించిన బ్లాక్ సినిమాలో కనిపించింది. ఆ సీన్లో అసభ్యకరమైన సన్నివేశంగా ఆ లిప్‌లాక్ కనిపించదు. ఆ సీన్ చాలా కళాత్మకంగా ఉంటుంది. ఆ సీన్లో అశ్లీలతకు బదులు ప్రేమ కనిపిస్తుంది అని రాణి ముఖర్జి అన్నారు. ఈ సీన్లో చాలా ఎమోషనల్, ఫీలింగ్స్, సున్నితత్వం కనిపిస్తుందన్నారు.
స్క్రిప్టు డిమాండ్ చేస్తే
దో లఫ్జోంకి సినిమాలో తాను కూడా అంధ యువతిగా నటించాను. ఆ సినిమాలో ఓ సీన్లో లిప్‌లాక్ అవసరం. స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్ల అలాంటి సీన్‌ను ఒప్పుకోవడం న్యాయంగా కనిపించింది. ఆ సీన్ చేయడానికి ప్రధాన కారణం బ్లాక్ సినిమాలోని రాణి ముఖర్జి, అమితాబ్ నాకు స్ఫూర్తి అని కాజల్ అగర్వాల్ అన్నారు.
లిప్‌లాక్ ఒప్పుకోకపోవడం వల్ల చాలా నష్టం.
కేవలం లిప్‌లాక్ సీన్లను ఒప్పుకోకపోవడం వల్ల నా కెరీర్లో చాలా ప్రాజెక్టులు మిస్ అయ్యాయి. అలా నాకు ప్రాజెక్టులు దక్కకపోవడం వల్ల నష్టం ఏమిలేదు. నాకంటూ ఓ ఇమేజ్ ఉంది. ప్రేక్షకులు, అభిమానుల అంచనాల మేరకే నేను నటిస్తాను. కానీ అశ్లీల, అసభ్య సన్నివేశాల్లో నటించడం ద్వారా కలిగే ప్రయోజనాలు నాకు అక్కర్లేదు అని కాజల్ చెప్పారు.
Recommended Video
ఇండియన్ 2 మూవీలో కమల్‌తో
కాజల్ అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదం తర్వాత షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి మళ్లీ వెళ్తుంది. అలాగే మోసగాళ్లు అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే జాన్ అబ్రహంతో ముంబై సాగాలో నటిస్తున్నది. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్నది.