లిప్స్ టచ్ చేయకుండానే లిప్ లాక్.. స్టార్ హీరో ముద్దుపై క్లారిటీ ఇచ్చిన కాజల్
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. ఆమె ఎలాంటి సినిమాలు చేసిన కూడా తన అందంతోనే సినిమాకు ఒక స్పెషల్ ఎట్రాక్షన్ తెస్తుంది. ప్రస్తుతం యువ హీరోయిన్స్ డామినేషన్ ఎక్కువవుతున్నా కూడా కాజల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో అవకాశాలను అందుకుంటోంది. అయితే ఒక ఇంటర్వ్యూలో స్టార్ హీరోతో లిప్ లాక్ సన్నివేశం గురించి మాట్లాడిన ఈ బ్యూటీ ఎవరికి తెలియని విషయాన్ని చెప్పింది.

ఏ మాత్రం గ్యాప్ లేకుండా
కాజల్ అగర్వాల్ మూడు పదుల వయసులోకి వచ్చినప్పటికీ ఇంకా 20ఏళ్ళ అమ్మాయిలానే మెరుస్తోంది. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా గత దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. దాదాపు టాలీవుడ్ , కోలీవుడ్ లో స్టార్ హిరోలందరితో నటించింది.

లిప్ లాక్ అనగానే సూర్య భయపడ్డాడు
గ్లామర్ ట్రెడిషినల్ పాత్రలను కూడా చేసిన కాజల్ పలు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఒకసారి తమిళ్ స్టార్ హీరో సూర్యతో లిప్ లాక్ సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు కొంత ఆందోళన కలిగిందట. ముఖ్యంగా అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉండే హీరో సూర్య కొంత బయపడినట్లు కాజల్ తెలిపింది.

పేదలు తాకకుండానే వెండితెరపై ముద్దు సీన్
ఆ సినిమా మరేదో కాదు. కెవి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రదర్స్. అవిభక్త కవలలుగా రెండు విభిన్నమైన పాత్రలలో సూర్య నటించిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఆ సినిమాలో కాజల్ సూర్య లిప్ లాక్ సీన్ లో నటించాల్సి వచ్చింది. కానీ అది నిజమైన లిప్ లాక్ కాదట. పేదలు తాకకుండానే వెండితెరపై ముద్దు సీన్ ని క్రియేట్ చేశారట.
Recommended Video

ఫేక్ లిప్ లాక్..
ఆ సినిమాలో ఎపిసోడ్ కి ముద్దు సీన్ తప్పనిసరి కావడంతో, దర్శకుడు ఆ విషయంలో స్టార్స్ ఒప్పుకోకపోయినా కూడా చేయాల్సిందేనని పట్టు బట్టాడట. ఇక విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ అందుకు ఒక స్పెషల్ ప్లాన్ వేసి ముందుగా సూర్యని గ్రీన్ మ్యాట్ వద్ద ఉంచి ఒక గ్లాస్ కి ముద్దు ఇప్పించాగా. ఇక కాజల్ ఒక బొమ్మకు కిస్ ఇచ్చిందట. ఆ తరువాత ఇద్దరిని కలిపేసిన టెక్నీషియన్స్ నిజమైన ముద్దు అనేలా సీన్ క్రియేట్ చేశారు. ఆ విధంగా పేదలు టచ్ చేయకుండానే వెండితెరపై లిప్ లాక్ సీన్స్ ని ప్రజెంట్ చేసినట్లు కాజల్ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











