Kajal Aggarwal: కాజల్ కొడుకు పేరు బయట పెట్టేసిన సోదరి.. పేరు ఎంటో తెలుసా?
లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ కాజల్ అగర్వాల్ కరోనా మన దేశంలో ఎంటరైన సమయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది జనవరి నెలలో తాను గర్భవతిని అని ప్రకటించిన ఆమె తాజాగా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా మగబిడ్డకు పేరు పెట్టిన విషయాన్ని ఆమె సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

కొద్దిమంది సమక్షంలో
లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే అందరి లాగా కాకుండా కాస్త ఫేడవుట్ అవుతున్నాను అని అర్థం అయిన వెంటనే ఆమె తన చిన్ననాటి స్నేహితుడు ముంబైలో వ్యాపారం చేస్తున్న గౌతమ్ అనే వ్యక్తితో ఏడు అడుగులు వేసింది. కరోనా సమయంలో అతి సన్నిహితులైన కొద్దిమంది సమక్షంలో వీరి వివాహం జరిగింది.

కొద్దిమంది సమక్షంలో
అయితే తాను గర్భవతిని అయ్యాను అంటూ జనవరి నెలలో కాజల్ అగర్వాల్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఆమె ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ప్రెగ్నెన్సీ కి సంబంధించిన కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ కాజల్ అగర్వాల్ బాగానే డబ్బులు వెనకేసుకుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఏదైతేనేం కాజల్ అగర్వాల్ 19వ తేదీన ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ప్రకాశవంతంగా
ఈ విషయం మీడియాలో ప్రచారం జరిగింది కానీ దానికి సంబంధించి కాజల్ అగర్వాల్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా ఈ విషయం మీద కాజల్ అగర్వాల్ సోదరి నిషా ఆసక్తికరంగా ఒక పోస్ట్ పెట్టింది. 19వ తేదీ ఉదయం మా కుటుంబంలోనికి ఒక అద్భుతమైన చిన్నారికి స్వాగతం పలికామని, ఆ చిన్నారి అద్భుతమైన నవ్వు మెరుస్తున్న వాడి కళ్ళు మా ఈ రోజు మొత్తం అన్ని ప్రకాశవంతంగా చేశాయని చెప్పుకొచ్చింది.

అక్క బాటలోనే
అంతేకాక వాడి చిన్ని చిన్ని పాదాలు చిన్ని చిన్ని చేతులు అద్భుతంగా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇవన్నీ చెబుతూనే ఆ చిన్నారికి నీల్ కిచ్లు అనే పేరు పెడుతున్నట్లు ఆమె వెల్లడించింది. కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ కూడా అక్క బాటలోనే తెలుగు సినీ పరిశ్రమ ద్వారా పరిచయమై కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత తన ప్రియుడిని వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.

సినిమాల విషయానికి వస్తే
చెల్లి వివాహం జరిగిన తర్వాత చెల్లి కి పుట్టిన బిడ్డలతో కాజల్ అగర్వాల్ చాలా క్వాలిటీ టైం గడిపేది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఎప్పటికప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేసేది. అలాంటి ఆమె ఇప్పుడు తల్లి కావడంతో మరింత ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక కాజల్ హీరోయిన్ గా నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆమె భావిస్తోంది.


Click it and Unblock the Notifications











