ప్రెగ్నెన్సీని కూడా అందుకు వాడేస్తున్న కాజల్.. సైలెంట్ గా భలే అనౌన్స్ చేసిందే!
టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆమె భర్త అధికారికంగా ప్రకటించారు కానీ కాజల్ నోటి నుంచి కూడా తాజాగా ఈ విషయం వెలువడింది. ఆ వివరాల్లోకి వెళితే

వరుసగా సినీ అవకాశాలు
తెలుగులో లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కాజల్ అగర్వాల్ ఆ తరువాతి కాలంలో టాలీవుడ్ మొత్తంలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అమ్మవారి బడా హీరోలతో సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాలంలో అయితే సినిమాలు తగ్గించింది. సినిమాలు తగ్గిపోయిన క్రమంలో ఆమె వివాహం కూడా చేసుకుంది. అనూహ్యంగా వివాహం జరిగిన తర్వాత ఆమెకు వరుసగా సినీ అవకాశాలు రావడం మొదలయ్యాయి.

గర్భవతి అని తేలడంతో
ముందుగా ఆమె చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే భారతీయుడు-2 సినిమాలో కూడా కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా ఎంపికయింది. అయితే అనేక కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నాగార్జున సరసన ఘోస్ట్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది, అన్ని అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాత ఆమె గర్భవతి అని తేలడంతో ఆమె ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా
ఇక కాజల్ అగర్వాల్ గర్భవతి అయినట్లు ఆమె భర్త గౌతం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వెల్లడించారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ తాను గర్భవతిని అయ్యాను అనే విషయాన్ని ఒక వీడియో విడుదల చేసి ప్రకటించింది. అయితే ఆమె తన గర్భాన్ని కూడా మార్కెటింగ్ కోసం వాడుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగానే కాజల్ కోల్గేట్ లాంటి కొన్ని సంస్థలకు గతంలో బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. తద్వారా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా తీసుకునేది.

ప్రెగా న్యూస్ అనే సంస్థ
ఇప్పుడున్న గర్భందాల్చిన క్రమంలో ఆమెకు ఎలాంటి బ్రాండ్ ఎండార్స్ మెంట్ కుదరదు అనుకుంటున్న క్రమంలో గర్భవతులకు అవసరమయ్యే ప్రెగా న్యూస్ అనే సంస్థ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు కనిపిస్తోంది ఈ మేరకు కాజల్ అగర్వాల్ ఆ సంస్థకు ప్రమోషన్ చేస్తూ తాను గర్భవతిని అయ్యాను అనే విషయాన్ని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఉత్పత్తులను ప్రచారం చేయడం ద్వారా నటీమణులు మంచి మొత్తాన్ని సంపాదిస్తారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలలో కాజల్ కూడా ఒకరు, ఆమెకు 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Recommended Video

మంచి రెమ్యునరేషన్ కూడా
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకుంది, "ఈ సంవత్సరం నా చిన్నారిని కలవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను, Prega News నాకు ఖచ్చితమైన మరియు వేగవంతమైన ఫలితాలను సులభంగా అందించడంతో, నా గర్భధారణ ప్రయాణం సరైన మార్గంలో ప్రారంభమైందని నేను విశ్వసిస్తున్నాను. నేను ఎందుకు ఎంచుకున్నానో తెలుసుకోవడానికి నా వీడియో చూడండి". అని వీడియో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోకు గాను ఆమె మంచి రెమ్యునరేషన్ కూడా పొందిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











