Kajal Aggarwal Pregnant: అడ్డంగా దొరికిపోయిన కాజల్.. ఆ ఫొటోలు రావడంతో ప్రెగ్నెంట్ మేటర్ లీక్

టాలీవుడ్‌లోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా అడుగు పెట్టారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ చందమామగా పేరొందిన కాజల్ అగర్వాల్ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. అనతి కాలంలోనే అద్భుతమైన యాక్టింగ్, అదిరిపోయే అందంతో మెప్పించి.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం ఆమె పెద్దగా సినిమాలు చేయకపోవడమే. ఇలాంటి సమయంలో కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని ఫొటోలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. ఫుల్ పాపులర్

అలా పరిచయం.. ఫుల్ పాపులర్

ఆరంభంలో మోడల్‌‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన 'లక్ష్మీ కల్యాణం'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. తొలినాళ్లలోనే తన నటనతో మెప్పించిన ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో లక్కీ హీరోయిన్‌గా పేరొంది రెమ్యూనరేషన్ బాగానే అందుకుంది.

అందరితోనూ రచ్చ చేసిన భామ

అందరితోనూ రచ్చ చేసిన భామ

తక్కువ సమయంలోనే ఎన్నో హిట్లను అందుకోవడంతో కాజల్ పేరు టాలీవుడ్‌లో హైలైట్ అయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ఫలితంగా అప్పట్లో తన హవాను చూపించింది. ఇక, రోజులు గడిచిన కొద్దీ స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించి రచ్చ రచ్చ చేసేసింది.

స్పీడు తగ్గించేసిన చందమామ

స్పీడు తగ్గించేసిన చందమామ

కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో చాలా కాలం పాటు స్టార్‌డమ్‌ను చూపిస్తూ దూసుకుపోయింది. ఇలా దాదాపు ఐదారేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ నటించింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె సినిమాల వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారనే చెప్పాలి.

అన్నింట్లోనూ తప్పుకోవడంతో

అన్నింట్లోనూ తప్పుకోవడంతో

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు చిత్రాల్లోనూ నటించింది. కానీ, ఇటీవలే అక్కినేని నాగార్జున నటిస్తోన్న 'ఘోస్ట్' నుంచి తప్పుకుంది. అలాగే, తమిళ చిత్రం 'రౌడీ బేబీ' నుంచి కూడా బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాల విషయంలోనూ ఆమె యూటర్న్ తీసుకుంది.

తల్లి కాబోతుండడం వల్లే ఇలా

తల్లి కాబోతుండడం వల్లే ఇలా

బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుతో వివాహం జరిగిన తర్వాత కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందని కొద్ది నెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ వాటిని కొట్టివేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాల నుంచి తప్పుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Fires On Anchor Ravi Elimination || Filmibeat Telugu
అడ్డంగా దొరికిపోయిన కాజల్

అడ్డంగా దొరికిపోయిన కాజల్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కాజల్ అగర్వాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను స్టోరీగా పెట్టుకుంది. అందులో ఆమె వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది. ఇందులో ఆమె గర్భంతో ఉన్నట్లు కనిపించింది. దీంతో కాజల్ ప్రెగ్నెంట్ అయిందన్న వార్తలు నిజమేనని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X