Happy birthday kajal aggarwal: వయసు ఎంత పెరిగినా అదే అందం.. పెళ్లి ఎప్పుడంటే?
టాలీవుడ్ చందమామగా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. గడిచిన పదేళ్లలో ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కూడా కాజల్ స్థాయిలో అయితే క్లిక్కవ్వలేదు. ఎందుకంటే అమ్మడు దాదాపు స్టార్ హీరోలందరితో వర్క్ చేసింది. ఇక నేడు కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి విషెస్ అందుతున్నాయి. ఇక పెళ్లి విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది.
.

13ఏళ్ల నుంచి..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఏడాదిలోనే 50 మందికి పైగా హీరోయిన్స్ పరిచయమవుతున్నారు. ఓ విదంగా అన్ని విభాగాల్లో కంటే కూడా ఎక్కువగా హీరోయిన్స్ ఫీల్డ్ లోనే పోటీ తీవ్రంగా ఉంటుంది. గ్లామర్ తోనే కాకుండా నటనపరంగా కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వాలి. ఆ దారిలో నడిచింది కాబట్టే కాజల్ 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

రెండు తరాల హీరోలతో..
లక్ష్మీ కల్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో వర్క్ చేసింది. మెగా, అక్కినేని రెండు తరాల హీరోలతో రొమాన్స్ చేసి నేటితరం హీరోయిన్స్ కి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నేడు కాజల్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సెలబ్రెటీలు ఆమె ఫొటోస్ పోస్ట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పెళ్లెప్పుడంటే..
టాలీవుడ్ నుంచి ఆలోచిస్తే.. అనుష్క తరువాత హీరోయిన్స్ లలో కొంచెం ఎక్కువ వయసు ఉన్న కాజల్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. నేటితో కాజల్ వయసు 35 ఏళ్ళు. అయితే కాజల్ 30 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆ మధ్య కెరీర్ కాస్త డౌన్ కావడంతో ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలని కాస్త ఒత్తిడి తెచ్చారట.
Recommended Video

బాలీవుడ్ ఆఫర్స్ రావడంతో..
ఎందుకో గాని కాజల్ కొన్నాళ్ల తరువాత మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఇక గత ఏడాది పెళ్లి చేసుకోవడానికి మరోసారి సిద్ధం కాగా ఎప్పుడు లేనిది బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ రావడంతో ఆ ఆలోచనను మానుకుంది. ఇక నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ బ్యూటీ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











