For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kajal Aggarwal జోష్ పెంచిన చందమామ.. పాపులర్ బ్రాండ్‌ను బుట్టలోకి వేసుకొని!

  |

  దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జీవితంలో అనూహ్యమైన మార్పులు జరిగిపోయాయి. లాక్‌డౌన్ తర్వాత పెళ్లి కావడం, ఆ వెంటనే ఆమె గర్బం దాల్చడం.. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనివ్వడం లాంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి. అయితే డెలీవరీ తర్వాత కాజల్ జోష్ మూమాలుగా లేదు. సినిమాలు, యాడ్స్‌తో బిజీగా మారింది. తాజాగా ఓ ప్రముఖ కంపెనీ డీల్‌ను తన ఖాతాలో వేసుకొన్నది. కాజల్ అగర్వాల్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాల్లోకి వెళ్తే..

  కొత్త సినిమాలు కోసం

  కొత్త సినిమాలు కోసం

  సినిమాల పరంగా చివరిగా దుల్కర్ సల్మన్‌తో నటించిన 'హే సినామిక'తో కాజల్ వెండితెరపై మెరిసింది. నీల్ కిచ్లూకు జన్మనిచ్చినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది. దీంతో కాజల్‌​ను మరోసారి తెరపై చూడాలనుకుంటున్న అభిమానులు.. ఆమె కొత్త చిత్రాల గురించిన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

  ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి..

  ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి..

  ఓ అందమైన ఫొటోతో భర్త గౌతమ్ కిచ్లూకు అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది . ఈ సందర్భంగా తమ కుమారుడు నీల్​తో దిగిన ఫ్యామిలీ ఫొటోను తొలిసారి అభిమానులతో షేర్ చేసుకుంది. ఇన్​స్టాగ్రామ్ చేసిన ఈ పోస్ట్​లో.. ముగ్గురూ తెలుపు దుస్తుల్లో కనువిందు చేశారు. ఫొటోలో గౌతమ్‌​కు కాజల్ ఆప్యాయంగా ముద్దు పెడుతుండగా వారిని తమ కుమారుడు చూస్తూ ఉన్నాడు.

  నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం అంటూ

  నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం అంటూ

  భర్త గౌతమ్ కిచ్లూకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు. మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం గౌతమ్" అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది కాజల్. 75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలోనూ కాజల్ దంపతులు సందడి చేశారు. ఈ ఈవెంట్‌​కు ముఖ్య అతిథిగా హాజరైన కాజల్.. పింక్ డ్రెస్​లో మెరిసిపోయింది. కాగా, గౌతమ్ కూడా వైట్ షర్ట్‌​పై రెడ్ జాకెట్‌​తో అదుర్స్ అనిపించారు.

  బ్రాండ్ అంబాసిడర్‌గా కాజల్

  బ్రాండ్ అంబాసిడర్‌గా కాజల్

  కెరీర్‌ను చక్కబెట్టుకొంటూనే బ్రాండ్ ప్రమోషన్స్‌ను కాజల్ మొదలుపెట్టింది. ఆయుర్వేద కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంపెనీకి సంబంధించిన టీఏసీ బేబీ కేర్ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తున్నది. ఈ యాడ్ కోసం ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానిని కంపెనీ రంగంలోకి దించింది.

  ఆయుర్వేదతో భాగం కావడం

  ఆయుర్వేదతో భాగం కావడం


  ఆయుర్వేద కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. ఈ కంపెనీ ఫ్యామిలీలో సభ్యురాలిగా కావడం చాలా ఆనందంగా ఉంది. గత కొద్ది నెలలుగా ఓ తల్లిగా ఈ కంపెనీ ప్రోడక్ట్స్‌తో భాగమయ్యాను. పిల్లలకు చాలా ఉపయోగపడే ఈ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. సురక్షితం, హై క్వాలిటీ ప్రొడక్ట్ అయిన ఆయుర్వేద అంటే నాకు చాలా ఇష్టం అని కాజల్ అన్నారు.

  కాజల్ కెరీర్ విషయానికి వస్తే..

  కాజల్ కెరీర్ విషయానికి వస్తే..


  యూనివర్సల్ హీరో కమల్ హసన్ కలల ప్రాజెక్టు 'ఇండియన్ 2'లో ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు ఈ మధ్యనే కాజల్ వెల్లడించింది. 1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు ఇది సీక్వెల్. ఇటీవలే సెట్​లో జరిగిన ప్రమాదం కారణంగా 'ఇండియన్ 2' షూటింగ్ నిలిచిపోయింది. త్వరలోనే దీనిని మళ్లీ పట్టాలెక్కించేందుకు కమల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని ఇతర నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉంది చిత్రబృందం.

  English summary
  Actress Kajal Aggarwal started her second innings will. He became brand ambassador for The Ayurveda Company, after sharing first family photo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X