Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అందుకే కాజల్ అంటే పడి చచ్చేది.. అభిమానికి గూగుల్ పేలో డబ్బులు పంపిన చందమామ
టాలీవుడ్ చందమామ అనగానే అందరి మనసులో కాజల్ బొమ్మ పడిపోతుంది. కేవలం అందంతోనే కాకుండా మంచి మనసుతో కూడా కాజల్ అభిమానుల మనసులను గెలుచుకుంటోంది. ఇటీవల ఆమె చేసిన ఒక మంచి పనికి అభిమానులు ఆమెకు మరింత ఫిదా అవుతున్నారు. ఓ అమ్మాయి బాధ చూసిన కాజల్ గూగుల్ పేలో డబ్బులు పంపించేసింది.
పోటీగా ఎంత మంది వచ్చినా
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కల్యాణం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కాజల్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పోటీగా ఎంత మంది అందమైన హీరోయిన్స్ వచ్చినా కూడా ఈ బ్యూటీ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా కాజల్ కోసం థియేటర్స్ వరకు వెళ్లే కుర్రాళ్ళు చాలా మంది ఉంటారు.
చిరునవ్వుతో సరికొత్తగా
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కాజల్ తన కెరీర్ ను ఒక ప్లాన్ తో సెట్ చేసుకుంటూ వచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 14ఏళ్లయినా కూడా కాజల్ అందం ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు తన చిరునవ్వుతో సరికొత్తగా కనిపిస్తోంది. దాదాపు అగ్ర హీరోలందరితో నటించింది.
కాజల్ ఆర్థిక సహాయం
అయితే కాజల్ హీరోయిన్ గా ఎంత క్రేజ్ అందుకున్నా కూడా తన మనసు మాత్రం ఎప్పటికి ఒకేలా ఉంటుందని మరోసారి నీరూపించింది. ఆమె చేసిన సహాయల గురించి కూడా పెద్దగా ప్రచారాలు చేసుకోదు. అభిమానులే ఆమె సహాయల గురించి సోషల్ మీడియాలో ఎంతో ఇష్టాంగా చెప్పుకుంటారు. ఇక ఇటీవల ఒక అమ్మాయి కష్టం చూసి కాజల్ ఆర్థిక సహాయాన్ని అందించింది.
ట్విట్టర్ ద్వారా సహాయం
ఇటీవల సుమ అనే ఒక అమ్మాయి ట్విట్టర్ ద్వారా ఒక సహాయాన్ని కోరింది. రీసెంట్ గా నా జాబ్ పోయింది. ఎమ్.పార్మ్ పరీక్ష పీజు కోసం డబ్బు కుదరలేదు. 83,000కట్టాలి అంటూ దయచేసి ఎవరైనా సహాయం చేయండి అని సుమ ట్విట్టర్ ద్వారా అభ్యరించింది.
గూగుల్ పేలో లక్ష రూపాయలు
విషయం తెలుసుకున్న కాజల్ అగర్వాల్ వెంటనే అమ్మాయి పరిస్థితి గురించి కూడా తన టీమ్ ద్వారా తెలుసుకుంది. మరో సెకండ్ ఆలోచించకుండా తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయి ఎకౌంట్ కు ఒక లక్ష రూపాయలు గూగుల్ పే ద్వారా ట్రాన్స్ ఫర్ చేసింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అభిమానులు అందుకే కాజల్ అంటే పడి చచ్చేది అని కామెంట్స్ చేస్తున్నారు.