ఇండస్ట్రీలో స్లో పాయిజన్ అదే.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియా సామాన్యుల నుంచి ప్రముఖల వరకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు.. సోషల్ మీడియాను మంచికి వాడితే దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దీని వల్ల చెడే ఎక్కువగా జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఫేక్ న్యూస్‌తో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ సాయంతో కొందరు రెచ్చిపోతున్నారు. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను డీప్ ఫేక్‌తో సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. ప్రతినిత్యం ఎందరో బాధితులు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేశారు అగ్రనటి కాజల్ అగర్వాల్. ఈ వివరాల్లోకి వెళితే..

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ మూవీ ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్. జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బీ షిండే నిర్మిస్తున్నారు. శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా, అతుల్ తివారి, కమలేష్ సావంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిషాంత్ భగవత్ సినిమాటోగ్రాఫర్‌గా, మంగేష్ ధాక్డే సంగీత దర్శకుడిగా, అనీశ్ మాత్రే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Kajal Aggarwal described social media as slow poison and her serious Remarks on fake content

మనం తినే ఆహారంలో విషం ఉందా? పంటలు పండించేందుకు వాడుతున్న రసాయనాలు మన పిల్లల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయా అన్న ఇతివృత్తం ఆధారంగా ది ఇండియా స్టోరీ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఆసక్తిని పెంచుతున్నాయి. గతంలో గ్లామర్ రోల్స్‌తో అలరించిన కాజల్ అగర్వాల్.. ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వస్తున్నారు. సత్యభామకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్‌ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా ది ఇండియా స్టోరీ డైరెక్టర్ చేతన్‌తో కలిసి కాజల్ అగర్వాల్ ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో స్లో పాయిజన్ ఏది అని దర్శకుడు చేతన్‌ని యాంకర్ అడిగారు. దీనికి కాజల్ అగర్వాల్ సమాధానం ఇచ్చారు. ఫుడ్ పాయిజనింగ్ అనేది ఉన్నట్లే సోషల్ మీడియా అనేది బ్రెయిన్ పాయిజనింగ్ లాంటిది. సామాజిక మాధ్యమాల్లో మనం ఇతరుల కంటెంట్ చూస్తుంటాం. కానీ అందులో సగం కూడా నిజం ఉండదు, చాలా వరకు ఏఐతో సృష్టించినవే ఉంటాయి. అసలు మనం ఏం చూస్తున్నాం? ఈ చెత్తను బుర్రలోకి ఎక్కించుకుంటున్నాం అనేది ఆలోచించరు అని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఇండస్ట్రీలోని నటీనటుల విషయంలో ఇది మరీ ఎక్కువగా జరుగుతుంది. ప్రతినిత్యం ఎన్నో డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి నకిలీవేనని మనకు కూడా అర్ధమవుతుంది, నిజానికి ఎంత ఫేమస్ అయితే అన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్య ఒక్క చిత్ర పరిశ్రమకు చెందినవారికే పరిమితమైనది కాదు. ఈ రోజుల్లో అందరికీ సంబంధించిన ఇబ్బందిగా మారిపోయిందని కాజల్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: kajal aggarwal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X