twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొదటిసారి అలాంటి క్యారెక్టర్ లో కాజల్ అగర్వాల్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

    |

    లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్, ఆ తరువాత కృష్ణవంశీ తీసిన చందమామ సినిమా ద్వారా మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం రామ్ చరణ్ - రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా కూడా గొప్ప విజయం దక్కించుకుంది. ఇక అక్కడి నుండి టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా స్టార్ హీరోలతో కొనసాగుతూ వచ్చింది.

    తెలుగులో లో చాలామంది స్టార్ హీరోలతో కూడా నటించిన కాజల్, మెగాస్టార్ చిరంజీవి కామ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ లో కూడా నటించారు. ఆ విధంగా మగధీర లో అటు చరణ్ తో, అలానే ఖైదీ నెంబర్ 150లో ఇటు మెగాస్టార్ తో నటించి ఆ విధంగా తండ్రి తనయులతో నటించిన లేటెస్ట్ హీరోయిన్ గా ట్రెండ్ సెట్ చేసింది. ఇక అటు తమిళ్ తో పాటు హిందీలో కూడా పలు సినిమాల్లో ఛాన్స్ లు అందుకున్న కాజల్ అక్కడ కూడా పలు సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఆమె కెరీర్ లో మహేష్ తో నటించిన బిజినెస్ మ్యాన్, ఎన్టీఆర్ తో నటించిన బృందావనం, టెంపర్, అలానే ప్రభాస్ తో యాక్ట్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్, వంటి సినిమాలు మరింత మంచి పేరు తెచ్చిపెట్టాయి.

    Kajal aggarwal different role in upcoming star hero movie

    అయితే ఇటీవల గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న అనంతరం తన సినిమాలని ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ కొనసాగుతున్నారు కాజల్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య మూవీలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అయితే కెరీర్ లో ఫస్ట్ టైం కింగ్ అక్కినేని నాగార్జున సరసన హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్నారు. గరుడవేగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మంచి యాక్షన్ తో కూడిన భారీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ సునీల్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున ఒక అండర్ కవర్ ఏజెంట్ గా నటిస్తుండగా ఆయన బృందంలో పని చేసే ఒక ఏజెంట్ పాత్రలో కాజల్ నటిస్తున్నట్లు సమాచారం.

    ఇక ఈ పాత్ర కోసం కాజల్ నిణుపుల నుండి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర కొంత నెగటివ్ షేడ్స్ తో సాగుతుందని, తప్పకుండా మూవీ రిలీజ్ తరువాత కాజల్ పాత్రకి అందరి నుండి మంచి పేరు దక్కడం ఖాయం అని అంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ మూవీ అధికారిక టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రేపు అక్కినేని నాగార్జున జన్మదినం సందర్భంగా విడుదల చేయనున్నారు. మరి తొలిసారిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న కాజల్ ఎంతవరకు ఆడియన్స్ ని మెప్పిస్తారో చూడాలి.

    English summary
    Kajal aggarwal different role in upcoming star hero movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X