టాలీవుడ్ సినీ కార్మికుల కోసం కాజల్ అగర్వాల్ విరాళం..
ఇండియాలో రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వీలైనంత త్వరగా కరోనా వైరస్ ని నిర్ములించడానికి చర్యలు తీసుకుంటూ ఇటీవల లాక్ డౌన్ ని పొడిగించింది విషయం తెలిసిందే. అయితే సినిమా పరిశ్రమలో చాలా మంది టెక్నీషియన్స్ కి పని లేకపోవడంతో వారి జీవితాలకు అండగా నిలుస్తున్నారు మన స్టార్స్.
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రిసిస్ చారిటీ ట్రస్ట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా మంది సినిమా నటులు, టెక్నీషియన్స్ ట్రస్ట్ కి నిధులు అందించగా హీరోయిన్స్ మాత్రం నెమ్మదిగా స్పందిస్తున్నారు. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ చారిటీ ట్రస్ట్ కి 2లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. హీరోయిన్స్ లో అందరికంటే ముందుగా లావణ్య త్రిపాఠి లక్షల రూపాయల అందించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు కాజల్ కూడా సాయం అందించడంతో ఆమెను చూసి మరికొందరు ముందుకు రావాలని అభిమానులు కోరుతున్నారు. కరోనా వైరస్ నిర్ములన నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా మరో రెండు నెలల వరకు సినీ కార్మికులకు పని దొరకడం అనుమనంగానే ఉంది. దీంతో సినీ పెద్దలు ఈ విషయంపై ఇటీవల చారిటీ ట్రస్ట్ ని స్థాపించి పేద కార్మికులకు సహాయం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











